Home / latest national news
నిమిషాల వ్యవధిలో సోమవారం నాలుగు భూకంపాలు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్‌ను కుదిపేశాయి. లడఖ్‌లోని కార్గిల్, జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో ప్రకంపనలు సంభవించాయి. మధ్యాహ్నం 3:48 గంటల ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చాయి.
దక్షిణ తమిళనాడు అంతటా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో పలు ప్రాంతాల్లో ఇళ్లు వరదనీటిలో మునిగిపోయాయి. పలు చోట్లచెట్లు కూలిపోయి కొండచరియలు విరిగిపడి రవాణా సదుపాయాలు స్తంభించిపోయాయి.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ( ఐడీఎఫ్ ) ఉత్తర గాజాలోని షెజాయా పరిసరాల్లో జరిగిన పోరాటంలో ముగ్గురు ఇజ్రాయెలీ బందీలపై పొరపాటున కాల్పులు జరిపినట్లు సైనిక ప్రతినిధి డేనియల్ హగారి శుక్రవారం తెలిపారు.షెజాయాలో జరిగిన పోరాటంలో ఐడీఎఫ్ పొరపాటున 3 ఇజ్రాయెలీ బందీలను శత్రువులుగా గుర్తించి కాల్పులు జరపడంతో బందీలు మరణించారు.
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ ఉత్పత్తుల్లో అనేక లోపాలు ఉన్నాయని హెచ్చరించింది. ఇది దాడి చేసేవారు సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుందని చెప్పింది.
కేరళలో కొత్త కోవిడ్ సబ్‌వేరియంట్ JN.1 కేసు నమోదైంది. 79 ఏళ్ల మహిళ కు నవంబర్ 18న జరిగిన RT-PCR పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో డిసెంబర్ 8న ఈ కేసు నమోదైంది. ఆమె ఇన్ఫ్లుఎంజా లాంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలు కనపడినా తరువాత తేరుకుంది.
మహారాష్ట్రలోని థానేలో తన ప్రియుడు కారుతో తనను ఢీకోట్టడానికి ప్రయత్నించడంతో తీవ్రంగా గాయపడినట్లు ప్రియా సింగ్ అనే యువతి తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో బ్యూరోక్రాట్ కొడుకు అయిన తన బాయ్‌ఫ్రెండ్ తనను కొట్టి, గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ లో తెలిపింది.
లోక్‌సభలో అలజడి సృష్టించిన చొరబాటుదారులు తమ అసలు ప్లాన్ వికటించి పార్లమెంటుకు చేరుకోవడంలో విఫలమైతే వారికి ప్లాన్ బి ఉందని దీనిలో కీలక సూత్రధారి లలిత్ ఝా విచారణ సందర్భంగా పోలీసులకు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, తాను చనిపోవడానికి అనుమతించాలంటూ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదికను కోరారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు పొగ కలకలం వెనుక ప్రధాన సూత్రధారి లలిత్ ఝా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్ననీమ్రానాలో అతను చివరిసారిగా కనిపించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా కాంప్లెక్స్‌ను కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతించింది.డిసెంబర్ 18న కోర్టు మళ్లీ విచారణ ప్రారంభించిన తర్వాత సర్వే విధివిధానాలు నిర్ణయించబడతాయి.