Plane Crash: మరో ఘోర ప్రమాదం.. ఇళ్లలోకి దూసుకెళ్లిన విమానం

Plane Crash In America: అమెరికాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. టేకాఫ్ అవుతుండగా.. విమానం ఒక్కసారిగా అదుపుతప్పి ఇళ్ల మధ్యలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాదం జరిగిన చుట్టూపక్కల ప్రాంతాల్లో మంటలు చెలరేగి ఇళ్లతోపాటు పార్కింగ్ లో ఉన్న వాహనాలు కాలిపోయాయి. ఈ ఘటనలో చాలామంది మృతి చెందినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.