Last Updated:

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ను అనుకరించిన టీఎంసీ ఎంపీ.. ప్రధాని మోదీ ఆరా

పార్లమెంటు ఆవరణలో తృణమూల్ ఎంపీ ఒకరు తనను అనుకరిస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ బుధవారం వెల్లడించారు. దీనిపై విచారం వ్యక్తం చేసిన మోదీ తాను కూడా గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి అవమానాలను భరించానని చెప్పారని అన్నారు.

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి  జగదీప్ ధన్‌ఖర్ ను అనుకరించిన టీఎంసీ ఎంపీ..  ప్రధాని మోదీ ఆరా

Jagdeep Dhankhar: పార్లమెంటు ఆవరణలో తృణమూల్ ఎంపీ ఒకరు తనను అనుకరిస్తున్న వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేసారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ బుధవారం వెల్లడించారు. దీనిపై విచారం వ్యక్తం చేసిన మోదీ తాను కూడా గత రెండు దశాబ్దాలుగా ఇలాంటి అవమానాలను భరించానని చెప్పారని అన్నారు.

20 ఏళ్లు భరించానని అన్నారు..(Jagdeep Dhankhar)

ప్రజా సేవలో తన ప్రయాణంలో ఇటువంటి అవమానాల స్వభావం నిరంతరాయంగా ఉందని ప్రధాని మోదీ ధన్‌ఖర్ కు తెలియజేశారు. ఇరవై సంవత్సరాలుగా తాను ఇలాంటి అవమానాలకు గురవుతున్నానని మరియు లెక్కలు వేస్తున్నానని మోదీ నాతో చెప్పారంటూ ధన్‌ఖర్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ Xలో పంచుకున్నారు. పార్లమెంటు కాంప్లెక్స్‌లో ఒక రాజ్యాంగ అధినేతకు జరిగిన సంఘటన దురదృష్టకరమని అన్నారు. టిఎంసి ఎంపి కళ్యాణ్ బెనర్జీ రాజ్యసభ ఛైర్మన్‌ను అనుకరించడం, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దానిని ఫోన్లో చిత్రీకరించడం జరిగింది. లోక్‌సభ భద్రతా ఉల్లంఘనపై గందరగోళం తర్వాత పలువురు ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఎంపీలు బయట గుమిగూడినపుడు ఇది జరిగింది. మరోవైపు, మిమిక్రీ ఘటనను బీజేపీ ధిక్కార చర్యగా అభివర్ణించింది. దీనిని తన ఫోన్‌తో చిత్రీకరించినందుకు రాహుల్ గాంధీపై విమర్శలను గుప్పించింది.

నొప్పించాలనే ఉద్దేశ్యం లేదు..

ఇలాఉండగా జగదీప్ ధన్‌ఖర్ ను అనుకరించిన టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ, ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశ్యం తనకు లేదని తన చర్యపై వివరణ ఇచ్చారు.ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశ్యం కాదని బెనర్జీ అన్నారు.అతను దీనిని ఎందుకు సీరియస్ గా తీసుకున్నారనేది నా ప్రశ్న. అతను అతను రాజ్యసభలో ఇలా ప్రవర్తిస్తారా ? అంటూ బెనర్జీ ప్రశ్నించారు.పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీనిపై మాట్లాడుతూ రాహుల్ గాంధీ కళ్యాణ్ బెనర్జీ వీడియోను చిత్రీకరించకపోతే ఎవరూ దానిని పట్టించుకునే వారు కాదని అన్నారు.

రాహుల్ గాంధీ స్పందన ఏమిటంటే..

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌పై టీఎంసీ నేత మిమిక్రీ చిత్రీకరణపై తొలిసారి స్పందించారు 150 మంది ఎంపీలను (సభ నుండి) బయటకు పంపించారు. కానీదానిపై మీడియాలో చర్చ లేదు.. అదానీపై చర్చ లేదు, రాఫెల్‌పై చర్చ లేదు, నిరుద్యోగంపై చర్చ లేదు. మా ఎంపీలు నిరుత్సాహపడి బయట కూర్చున్నారు. కానీ మీరు మిమిక్రీ గురించి చర్చిస్తున్నారు అని రాహుల్ గాంధీ అన్నారు.ఎవరిని ఎలా అగౌరవపరిచారు ? ఎంపీలు అక్కడ కూర్చున్నారు… వాళ్ల వీడియో తీశాను, నా ఫోన్‌లో ఉంది. మీడియా చూపిస్తోంది.. కనీసం కొన్ని వార్తలు అయినా చూపించండి… కొంచెం… అది మీ బాధ్యత. మీరు పూర్తిగా ఒక లైన్ తీసుకుంటే మేము ఏమి చేస్తాము అని వ్యాఖ్యానించారు.