Black Kismis for Eyesight: నల్ల ఎండు ద్రాక్షను ఇలా వాడితే ఎలాంటి కంటి సమస్యలైన బలాదూర్!

Black Kismis for Eye Sight: నల్ల ఎండుద్రాక్షా (నల్ల కిస్ మిస్) కంటి చూపుకు చాలా ఉపయోగకరం. ఇది దృష్టిని మెరుగుపరచడంతోపాటు జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఇది రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే చాలా ప్రయోజనం లభిస్తుంది. శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో ఒకటి కళ్ళు. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో మొబైల్, ల్యాప్‌టాప్, టాబ్లెట్‌ను అధికంగా ఉపయోగించడం అలవాటైంది. దీని ప్రభావం కళ్ళపై ఉంటుంది. దీని కారణంగా ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కిస్ మిస్ లలో పోషకాలు పుష్కలంగా ఉన్నందున కంటి చూపును పెంచడంలో సహాయపడతాయి.
నల్ల కిస్ మిస్ ( నల్ల ఎండు ద్రాక్షా) ఉండే పోషకాలు..
నల్ల కిస్ మిస్ ను డ్రై ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళ రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో పాటు, కేలరీలు, ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు లభిస్తాయి.
నల్ల ఎండు ద్రాక్షాను ఎలా తినాలి..
నల్ల ఎండుద్రాక్షను నానబెట్టి తినడం చాలా ఉత్తమం. ప్రతీరోజు ఓ 5 నుంచి 10 ఎండుద్రాక్షలను రాత్రిపూట నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి. పిల్లలకు మాత్రం పాలలో కలుపుకుని కూడా ఇస్తే బాగుంటుంది. తగినంత పోషకాలను అందిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా తినే వెసులుబాటు ఉంది. మూడు లేదా నాలుగు వారాల పాటు ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తింటే, కంటి అలసట, చికాకు, పొడిబారడం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.
కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది..
నల్లని ఎండుద్రాక్షలో విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్ పోషకాలు ఉంటాయి. ఇది కళ్ళలోని రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది. పొటాషియం వంటి పోషకాల కారణంగా, ఇది అధిక బిపి స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. దానిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ నల్ల ఎండుద్రాక్ష తినడం వల్ల అధిక బిపి, గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
గమనిక: పైన తెలుపబడిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పాటించే ముందు డాక్టర్ల సలహా తప్పనిసరి తీసుకోగలరు. కచ్చితత్వానికి చానల్ బాధ్యతవహించదు.