Walking with Barefoot on Grass: ఉదయం గడ్డి మీద నడిస్తే ఊహించని 5 ఆరోగ్య ప్రయోజనాలు!
Walking with Barefoot on Grass: ప్రతీ రోజు ఉదయం గడ్డిమీద చెప్పులు లేకుండా నడవాలని నిపుణులు సూచిస్తున్నారు. గడ్డిమీద నడవడం వలన ఐదు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రతీరోజు తెల్లవారుజామున గడ్డిమీద నడవాలంటున్నారు. దీనినే గ్రౌండింగ్, ఎర్తింగ్ అని పిలుస్తారు. ఇది శరీరానికి కావలసిన ప్రయోజనాలను అందిస్తుంది.
1. ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది
ఉదయం గడ్డి మీద నడవడం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయపు చల్లని గాలి, గడ్డి, ప్రకృతితో సహజంగానే సంబంధం ఉంటుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ప్రతీరోజు 10–15 నిమిషాలు చెప్పులు లేకుండా నడవడం ప్రశాంతతకు దారితీస్తుంది.
2. నాణ్యమైన నిద్రను ఇస్తుంది
చెప్పులు లేకుండా గడ్డిపై తిరగడం వలన గ్రౌండింగ్ మెలటోనిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుందని, ఇది మంచి నిద్రకు దారితీస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీరోజు ఉదయం నడవడం వలన రోజు మీకు అనుగుణంగా ఉంటుంది. దీంతోపాటే రాత్రి ఘాడమైన, ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
చెప్పులు లేకుండా గడ్డిపై నడవడం వల్ల భూమి నుండి ఎలక్ట్రాన్లను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. ఇది వాపును తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. ఉదయాన్నే గడ్డిపై నడవడం వలన సూర్యకాంతికి గురికావడంతో శరీరానికి విటమిన్ డి లభిస్తుంది.
4. పాదాలు, కండరాలను బలపరుస్తుంది
చెప్పులు లేకుండా నడవడం వలన పాదాలకు రక్షణ ఉండదు. కాబట్టి పాదాలు, చీలమండ, కండరాలు, స్నాయువులు బలంగా తయారవుతాయి. కాలక్రమేనా పాదాల ఆరోగ్యాన్ని మెరుగవుతుంది.
5. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
సున్నితంగా ఉన్న గడ్డిపై పాదరక్షలు లేకుండా నడవటం వలన నరాల చివరలు ఉత్తేజంగా ఉంటాయి. దీంతోపాటు శరీరం అంతటా రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో పాటు అవయవాలకు మెరుగైన ఆక్సిజన్ లభిస్తుంది.