Errol Musk : భారత్ ఓ అద్భుతమైన ప్రదేశం.. అయోధ్యను సందర్శించిన ఎలాన్ మస్క్ తండ్రి
Errol Musk : ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన యూపీలోని అయోధ్య నగరానికి వెళ్లారు. నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. భారతదేశం ఓ అద్భుతమైన ప్రదేశమని కొనియాడారు. ఇక్కడ ప్రజలు ప్రేమ, దయ కలిగిన వ్యక్తులు అన్నారు.
దక్షిణాఫ్రికాకు చెందిన ఎరోల్ మస్క్ తన పాఠశాల స్నేహితుడు మాయే మస్క్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకున్నారు. మాయే మస్క్ తన ముగ్గురు పిల్లలను ఒంటరిగా పెంచింది. సింగిల్ మదర్‌గా ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఎలాన్ మస్క్‌కు తన తండ్రి ఎరోల్ మస్క్‌తో విభేదాలు ఉన్నాయి. తండ్రి అంటే మస్క్‌కు అస్సలు ఇష్టం ఉండదు. ‘తన తండ్రి దుర్మార్గానికి ప్రతిరూపం అన్నారు. ఒక మనిషి ఎంత దారుణానికి ఒడిగట్టగలడో, అంతా తను చేయగలడని ఓ సందర్భంలో స్వయంగా మస్క్ వెల్లడించాడు.