Published On:

India vs England: గిల్ డబుల్.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ స్కోరు

India vs England: గిల్ డబుల్.. రెండో టెస్ట్‌లో భారత్ భారీ స్కోరు

India vs England: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ అదరగొడుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ భారత్ పైచేయి సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269) డబుల్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా(89), వాషింగ్టన్ సుందర్(42) సహకారం అందించారు. అంతకుముందు యశస్వీ జైస్వాల్(87), రాహుల్(2), కరుణ్(31), రిషబ్ పంత్(25), నితీశ్ కుమార్(1) నిరాశపరిచారు.టెయిలెండర్లు మహ్మద్ సిరాజ్(8), ఆకాశ్ దీప్(6), ప్రసిద్ధ్(5) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 3 వికెట్లు పడగొట్టగా.. టంగ్, వోక్స్ తలో రెండు వికెట్లు, కార్స్, స్టోక్స్, రూట్ తలో వికెట్ తీశారు.

 

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. ఆట ముగిసే సమయానికి 77 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది.  పటిష్టమైన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో డకెట్(0), పోప్(0)లను ఒకే ఓవర్‌లో ఆకాశ్ దీప్ పెవిలియన్ పంపగా.. క్రాలీ(19)ని మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. కీలక బౌలర్ బుమ్రా లేకపోయిన బౌలర్లు రాణిస్తున్నారు. ప్రస్తుతం రూట్(18), బ్రూక్(30) క్రీజులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి: