IPL 2025 : ఢిల్లీ విజయం.. ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో ఓటమి

PL 2025 : ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి ఛేదించింది. డూప్లెసిస్ (50) పరుగులతో అదరగొట్టాడు. జేక్ ఫ్రెజర్(38), కేఎల్ రాహుల్ 15 పరుగులు మాత్రమే చేశాడు. అభిషేక్ పోరెల్ (34), స్టబ్స్ (21) పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జీషన్ అన్సారీ ఒక్కేడే మూడు వికెట్లు తీశాడు. సన్ రైజర్స్‌కు ఇది మూడో ఓటమి. మూడు మ్యాచ్‌ల్లో కీలక బ్యాటర్లు రాణించలేకపోతున్నారు. ఓపెనర్లలో అభిషేక్ శర్మ మూడు మ్యాచ్‌ల్లో నిరాశపర్చాడు. ఈ రోజు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అనవసరంగా రన్ ఔట్ అయ్యారు. మిడిలార్డ్ బ్యాటర్లు ఇవాళ కూడా నిరాశ పర్చారు.