IPL 2025: నేడు గుజరాత్‌తో బెంగళూరు ఢీ.. ఆర్సీబీ హ్యాట్రిక్ కొట్టేనా?

IPL 2025 GT vs RCB: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆర్సబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. గుజరాత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.
ఇక, ఆర్సీబీ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ నమోదుపై కన్నేసింది. తమ సొంతగడ్డపై గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే కోల్‌కతా, చెన్నై సూపర్ కింగ్స్ జట్లను వారి సొంత మైదానాల్లో ఓడించి ఉత్సాహంతో కనిపిస్తోంది. గుజరాత్‌పై అంతే విశ్వాసంతో విజయం సాధించాలని పాటీదార్ సేన భావిస్తోంది. మరోవైపు గుజరాత్ కూడా ఆర్సీబీ జట్టును తన సొంతగడ్డపైనే ఓడించాలని వ్యూహాలు రచిస్తోంది.
ఇదిలా ఉండగా, క్రికెట్ అభిమానులు రిలయన్స్ జియో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. జియో పాపులర్ అపరిమిత డేటా ఆఫర్‌ను ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. అయితే, ఈ ఆఫర్ గడువు మార్చి 31తో ముగిసింది. దీంతో ఏప్రిల్ 15 వరకు పెంచుతూ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక, ఈ ఆఫర్ రూ.299 అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ తదితర వాటికి మాత్రమే వర్తిస్తుంది. అలాగే ఈ ఆఫర్‌తో 90 రోజుల పాటు 4కే క్వాలిటీ జియో హాట్ స్టార్ సబ్క్రిస్షన్ కూడా ఉంటుంది.