IPL 2025: వరుసగా రెండో విజయం.. లక్నోను చిత్తుగా ఓడించిన పంజాబ్

Punjab Kings defeated Lucknow Super Giants by 8 wickets: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన రసవత్తర మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఇది రెండో విజయం అందుకుంది.
టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్‌లలో ఆయుష్ బదోని 41, అబ్దుల్ సమద్ 27, నికోలస్ పూరన్ 44 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్షీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా.. లాకీ ఫెర్గూసన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కో జాన్సెన్, యు జ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీశారు.
172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ అలవోకగా ఛేదించింది. పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ప్రభసిమ్రాన్ సింగ్ 69, శ్రేయస్ అయ్యర్ 52, నెహాల్ వధేరా 43 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ రతి 2 వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రభసిమ్రాన్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డ్ దక్కింది.
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. కాగా, స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఆడుతూ పాడుతూ చేధించింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ విధ్వంసకర బ్యాటింగ్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుసగా బౌండరీలు బాదాడు. శ్రేయస్ అయ్యర్ కూడా విజృంభించడంతో పంజాబ్ 9.1 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ దాటేసింది.