Home / Bengaluru
నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉంచినందుకు విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ మరియు ఎంజిరోడ్లోని అనేక ఇతర సంస్థలపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పబ్ లకు అనుమతించిన సమయం రాత్రి ఒంటిగంట కాగా ఈ పబ్ లు రాత్రి 1,30 వరకు తెరిచి ఉంచడం, అర్దరాత్రి బిగ్గరగా సంగీతం వినిపిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప మేనేజర్ శ్రీధర్ బెంగుళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. శ్రీధర్ మృతదేహంతో పాటు సూసైడ్ నోటు, వీడియో మెసేజును పోలీసులు గుర్తించారు. తన చావుకు తానే కారణమని దర్యాప్తులో తన కుటుంబాన్ని చేర్చవద్దని లేఖలో శ్రీధర్ పేర్కొన్నారు.
కన్నడ నటుడు దర్శన్ తూగుదీప హత్య కేసులో ప్రస్తుతం కటకటాల పాలయ్యాడు. పవిత్ర గౌడ అనే యువతిలో అక్రమ సంబంధమే హత్యకు దారితీసింది. ప్రస్తుతం శాండిల్‌వుడ్‌లో ఈ కేసు సంచలనం రేపుతోంది.
శాండిల్‌వుడ్ టాప్ హీరో దర్శన్ తూగుదీప, ఆయన భార్యపవిత్ర గౌడను ఓ హత్య కేసులో పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా దర్శన్ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేయడంలో కీలకపాత్ర వహించాడని పోలీసులు మంగళవారం చెప్పారు.
బెంగళూరు కోర్టులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి బెయిల్ దక్కింది. గత ఏడాది కర్ణాటకలో జరిగిన శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అప్పటి భారతీయ జనతాపార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, 40 శాతం కమిషన్ తీసుకుని పనులు చేస్తోందని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వార్త పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది.
మే 18 కోసం యావత్ క్రికెట్ లోకం ఎదురుచూస్తోంది. ఆ రోజు బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇది నాకౌట్ మ్యాచ్‌లా మారిపోయింది. ఇరు జట్లకు కీలకం ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. అందుకే ఇరు జట్ల అభిమానులు రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు
దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ సందడి నెలకొంది. ఇక కర్ణాటకలోని బెంగళూరు విషయానికి వస్తే ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్ ఆర్ నారాయణమూర్తి, ఆయన బార్య రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి, ఇండియన్ క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రావిడ్‌లు శుక్రవారం పోలింగ్ ప్రారంభమైన వెంటనే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కర్ణాటక రక్షణ వేదికకు చెందిన కన్నడ కార్యకర్తలు బెంగళూరు నగరంలో అన్ని సైన్‌బోర్డ్‌లపై '60% కన్నడ' అని డిమాండ్ చేస్తూ చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. .కొందరు కార్యకర్తలు షాపుల ముందు ఇంగ్లిష్ సైన్ బోర్డులను చింపివేయగా, మరికొందరు ఆంగ్ల అక్షరాలపై నల్ల ఇంకు చల్లారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో అత్యంత అవినీతిపరులు ఈరోజు బెంగళూరులో సమావేశం అవుతున్నారని అన్నారు. విపక్షాల నినాదం కుటుంబమే ప్రథమం, దేశం ఏమీ కాదు అని ప్రధాని మోదీ అన్నారు.
వచ్చే ఏడాది జరిగే లోకసభ ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీలన్నీ ఏక తాటిపైకి వచ్చాయి. రెండు రోజుల పాటు జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశం ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు బెంగళూరులో ప్రారంభమైంది. సుమారు 26 పార్టీలు నగరంలో తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో సమావేశం అయ్యారు.