CM Siddaramaiah: సీఎం సిద్ధరామయ్య సర్కార్ కీలక ఆదేశాలు.. 15 రోజుల్లో నివేదిక
CM Siddaramaiah Key Decisions to Bengaluru Tragedy: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనపై ఆ రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ మేరకు 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ సీఎం సిద్ధరామయ్య సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఆర్సీబీ విక్టరీ పరేడ్ తీవ్ర విషాదం నింపింది. చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరగడంతో 11 మంది మృతి చెందగా.. 47 మందికి గాయాలయ్యాయి. అంచనాకు మించి క్రికెట్ అభిమానులు రావడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.