Published On:

Air India : మరీ ఆ సీటు స్పెషాలిటీ..? కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే?

Air India : మరీ ఆ సీటు స్పెషాలిటీ..? కూర్చోవడానికి ఇష్టపడరు ఎందుకంటే?

Air India Flight : విమానంలో ఎవరూ ఇష్టపడని 11ఏ సీటు. ప్రస్తుతం ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద ఘటనతో ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది. విమాన ప్రమాదం యావత్‌ దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క వ్యక్తి మాత్రమే మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు ప్రాణాలతో బయటపడానికి కారణం ఎకానామీ క్లాస్‌లో విమాన రెక్కల ముందు వరుసులో ఉండే 11ఏ విండ్‌ సీటు. దీని వెనుక ఎమర్జెన్సీ డోర్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా నెట్టింట సీటు చర్చనీయాంశంగా మారింది. సీటును విమానంలో ఎవరూ ఇష్టపడిన చెత్త సీటుగా చెబుతుంటారు. ఇష్టపడని 11ఏ సీటు ప్రమాద ఘటనలో ఒకే ఒక్కడిగా ప్రాణాలతో బయటపడగా, ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. మరీ సీటు స్పెషాలిటీ..? ఎందుకు చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారు..?

 

మృత్యుంజయుడు..
అహ్మ‌దాబాద్‌లో గురువారం జ‌రిగిన ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాదం నుంచి ర‌మేశ్ విశ్వాస్ కుమార్ అనే ప్ర‌యాణికుడు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. అతడు 11ఏ సీటులో కూర్చొన్నాడు. ఇది అతడి పాలిట వరమై ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయుడిలా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.

 

11ఏ కాస్త మిరాకిల్‌ సీటుగా మారిపోయింది..
విమానంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా, భయానక ప్రమాదం నుంచి అద్భుతం జరిగింది. భారత సంతతికి చెందిన బ్రిటిష్‌ వ్యక్తి ర‌మేశ్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయట పడ్డారు. ఇప్పడు ఒక్కసారిగా 11ఏ కాస్త మిరాకిల్‌ సీటుగా మారిపోయింది. బాధితుడు రమేశ్ ఇంటర్వ్యూలో ఎలా బతికానో తనకు తెలియదని వివరించాడు. దేవుని దయ వల్ల బయటపడినట్లు చెప్పాడు. ఆ ఘటనలో తాను కళ్లు తెరిచి చూసేటప్పటికీ తాను బతికే ఉన్నానని గుర్తించినట్లు తెలిపారు.

 

11ఏని అత్యంత చెత్త సీటుగా..
క్షణాల్లో గేటు విరిగిపోయి ఉండటాన్ని చూశానని, అక్కడ చిన్న గ్యాప్‌ ఉందని దాని నుంచి బయటకు దూకినట్లు చెప్పుకొచ్చాడు. బోయింగ్ 787 సీటింగ్ కాన్ఫిగరేషన్ ప్రకారం.. సీట్ 11ఏ అనేది స్టాండర్డ్ ఎకానమీ ఎగ్జిట్ రో సీటు. అలాంటి సీటులు సాధారణంగా ఒంపు తిరిగి ఉంటాయి. అందువల్ల ప్రయాణికులు ప్రమాదం నుంచి సులభంగా తప్పించుకోగలుగుతారనేది నిపుణుల అభిప్రాయం. అదే అతడి ప్రాణాలను కాపాడి ఉండొచ్చు. కానీ, బోయింగ్‌ 737లో 11ఏని అత్యంత చెత్త సీటుగా ప్రయాణికులు భావిస్తారట.

 

రీజన్‌ ఏమిటి..
‘ది విండో సీట్ 11ఏ’ అనేది కిటికీ లేని విండో సీటుగా ప్రసిద్ధి చెందినది. ఎయిర్ కండిషనింగ్ డక్ట్‌లు లేదా స్ట్రక్చరల్ రీన్‌ఫోర్స్‌మెంట్ల వంటి అంతర్గత భాగాల స్థానం కారణంగా కొన్ని సీట్లు- ముఖ్యంగా 9ఏ, 10ఏ, 11ఏ, 12ఏ వంటి రెక్క ముందు భాగంలో ఉన్న సీట్లకు పూర్తిగా కిటికీలు ఉండవు. బోయింగ్‌ 737 విమానాల్లో ఉంటుందట. చాలామంది ప్రయాణికులు సీటు గురించి ఫిర్యాదులు చేస్తారట.

 

కిటీకీ లేకుండా విండో సీటుగా..
ఎందుకంటే బయట వ్యూ కోసం ఆశించే ప్రయాణికులకు అత్యంత నిరుత్సాహపరిచే సీటుగా చెబుతుంటారు. కిటీకీ లేకుండా విండో సీటుగా పిలవడంతో చాలామంది ప్రయాణికులు పలుసార్లు ఇబ్బందులు పడ్డారట. అందుకే ప్రయాణికులు 11ఏ సీటంటే హడలిపోతారట. అసలు ఇష్టపడరట. దీన్ని విమానంలోనే అత్యంత చెత్త సీటుగా పరిగణిస్తారట. ఇప్పడు మృత్యుజయడు రమేశ్ కారణంగా సీటుకు డిమాండ్‌ పెరిగి అదనపు ఛార్జీలు వసూలు చేస్తారేమో అని నెట్టింట నెటిజన్లు కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతుండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి: