Published On:

Lewotobi Laki Laki Erupt: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. విమానాలు రద్దు

Lewotobi Laki Laki Erupt: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. విమానాలు రద్దు

Lewotobi Laki Laki Erupt in Indonesia: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్ధలైంది. లెవోటోబి లకి లకి అని అగ్నిపర్వతం నిన్న మరోసారి విస్ఫోటనం చెందింది. దీంతో తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్ లోని ఫ్లోర్స్ ద్వీపంలో ఆకాశంలోకి భారీగా బూడిద ఎగసి పడుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా లకి లకి అగ్నిపర్వతం ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటి. దీంతో ఆకాశంలోకి సుమారు 10 కిలోమీటర్ల ఎత్తవరకు భారీగా బూడిద ఎగసిపడుతోంది.

 

కాగా అగ్నిపర్వతం విస్ఫోటనం విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపింది. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడటంతో ఢిల్లీ నుంచి బాలి ద్వీపం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. అలాగే పలు దేశాల విమాన సర్వీసులపై కూడా ప్రభావం పడింది. పలు విమాన సర్వీసులను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. లకి లకి యాక్టీవ్ గా ఉండే అగ్నిపర్వతం. గత మార్చిలోనే ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది.