Vijay Rupani : మాజీ సీఎం విజయ్ రూపానీకి కలిసిరాని లక్కీ నెంబర్

Ahmedabad : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆయకు ఎప్పుడూ కలిసి వచ్చే లక్కీ నెంబర్ ఈసారి మాత్రం ప్రాణాలనే బలి తీసుకున్నది. విజయ్ రూపానీ 1206ను లక్కీ నెంబర్‌గా భావిస్తారు. ఆయన తన అన్ని వాహనాలకు లక్కీ నెంబర్‌నే ఎంపిక చేసుకుంటారు. కానీ, ఈ నెంబర్ మాత్రం గురువారం ఆయనకు కలిసి రాలేదు. అదృష్ట సంఖ్య దురదృష్ట దినంగా మారింది. ఈ నెల 12న ప్రమాదం జరగడం వల్ల ఆ తేదీని ఆంగ్లంలో రాస్తున్నప్పడు 12-06గా రాస్తాము. రూపానీ లక్కీ నెంబర్ ఆయన చనిపోయిన రోజు కూడా ఒకే సంఖ్యలా ఉన్నాయి.
లండన్‌లో ఉన్న కూతురిని కలిసేందుకు విజయ్ రూపానీ ఎయిర్ ఇండియా విమానం ఎక్కారు. అప్పటికే లండన్‌కు ఆయన భార్య చేరుకున్నది. పంజాబ్ ఇన్‌చార్జి మంత్రిగా ఉండడం వల్ల అక్కడ లుథియానా వెస్ట్ బైపోల్ కోసం ఆయన కొన్నాళ్లు ఉండాల్సి వచ్చింది. దీంతో భార్యతో కలిసి గతవారం ఆయన వెళ్లలేకపోయాడు. గురువారం విమానం ఎక్కగా, అది కూలిపోయింది. విమానంలో 242 మంది ఉండగా, 241 మంది మృతిచెందారు. విమానంలో విజయ్ రూపానీ కూడా ఉన్నారు. 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. విజయ్ భార్య లండన్ నుంచి శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు.
787-8 బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానానికి చెందిన బ్లాక్ బాక్సు దొరకలేదు. శుక్రవారం కేంద్రం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా వద్ద ఉన్న డ్రీమ్‌లైనర్ మోడల్ విమానాలను అన్నింటినీ గ్రౌండ్ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.