Published On:

Kannappa Ticket Price Hiked: ఈ నెల 27న కన్నప్ప చిత్రం విడుదల.. ఏపీలో టికెట్ ధరల పెంపు ఎంతంటే?

Kannappa Ticket Price Hiked: ఈ నెల 27న కన్నప్ప చిత్రం విడుదల.. ఏపీలో టికెట్ ధరల పెంపు ఎంతంటే?

Kannappa Ticket Rates Hiked in AP: మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ చిత్రం కన్నప్ప. ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలో ఏపీలో టికెట్‌ ధరల పెంపునకు సర్కారు అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 (జీఎస్టీ అదనం) వరకు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. మూవీ విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు టికెట్ల ధరలు అమల్లో ఉండనున్నాయి.

 

ఇది విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టు. దాదాపు పదేళ్లుగా దీని కోసం కష్టపడ్డారు. ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కించిన ఈ మూవీలో ఆయన టైటిల్‌ పాత్ర పోషించగా, రుద్రగా ప్రభాస్‌, కిరాతగా మోహన్‌లాల్‌, శివుడిగా అక్షయ్‌ కుమార్‌, పార్వతిగా కాజల్‌ అగర్వాల్‌, మహదేవ శాస్త్రిగా మోహన్‌బాబు నటించారు.

 

అన్నిరకాల చట్టపరమైన అనుమతులతో కన్నప్ప చిత్రం విడుదల చేస్తున్నామని నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పేర్కొంది. భారత రాజ్యాంగంలోని వాక్‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛను తాము గౌరవిస్తున్నప్పటికీ, మూవీని కించపరిచేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కన్నప్ప మూవీకి సంబంధించిన ఇద్దరు కీలక భాగస్వాములు, ప్రధాన నటులు మోహన్‌బాబు, మంచు విష్ణు వ్యక్తిత్వానికి, ప్రచార హక్కులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించింది.

 

 

ఇవి కూడా చదవండి: