Published On:

Harish Rao on CM Revanth: బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ల గురించి తెలుసుకోవడం: రేవంత్ రెడ్డిపై హ‌రీశ్‌రావు సెటైర్లు

Harish Rao on CM Revanth: బూతులు తెలుసుకున్నంత సులువు కాదు.. బేసిన్ల గురించి తెలుసుకోవడం: రేవంత్ రెడ్డిపై హ‌రీశ్‌రావు సెటైర్లు

Harish Rao criticized CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి తన్నీరు హ‌రీశ్‌రావు సెటైర్లు వేశారు. బ‌హుషా బ్యాగుల మీద ఉన్న నాలెడ్జ్.. బేసిన్ల మీద లేద‌ని విమ‌ర్శించారు. బేసిన్ల మీద బేసిక్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. గురువారం తెలంగాణ భ‌వ‌న్‌లో హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

 

రేవంత్‌కు బేసిక్స్ తెలియదు.. బేసిన్స్ తెలియదు.. తెలంగాణ పరువు పోయిందని ఎద్దేవా చేశారు. అంతులేని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బనకచర్ల ఏ బేసిన్‌లో ఉందని ముఖ్యమంత్రి అడుగుతున్నాడని, అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోండి అంటే ఆయనకు అర్థం కావటం లేదన్నారు. అఖిలపక్షం సమావేశాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్టుల ఎక్కడ కట్టారు కూడా తెలియదన్నారు. బూతులు తెలుసుకున్నంత సులువు కాదన్నారు. బేసిన్ల గురించి తెలుసుకోవడం అనేది రేవంత్‌రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. నల్లమల పులిబిడ్డ అని చెప్పే రేవంత్‌కు అది ఆంధ్రనా, తెలంగాణనా తెలియదని విమర్శించారు.

 

తన ప్రెస్‌మీట్ తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పాత తేదీలతో లేఖలు విడుదల చేస్తున్నారని హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన మాటలు బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఉందన్నారు. గోదావరి నుంచి 1000 టీఎంసీలు తీసుకోవాలని ఎలా చెబుతావు అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సోయి ఉండి మాట్లాడుతున్నాడా.. బేసిక్ నాలెడ్జి లేకుండా మాట్లాడుతున్నాడా అని మండిపడ్డారు. 2-10-2020లో కేంద్ర మంత్రికి కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు.

 

సముద్రంలో కలిసే 3000 టీఎంసీల నీళ్లలో 1950 టీఎంసీల నీళ్లు కావాలని లేఖలో పేర్కొన్నారని తెలిపారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో పుట్టినట్లు ప్రగల్బాలు పలుతున్నావని, కృష్ణానది గురించి తెలియదని సీరియస్ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ముందు కేసీఆర్ పోరాటం చేశారని, సెక్షన్ 3ని సాధించారని గుర్తుచేశారు. కేసీఆర్ జీవితం నీళ్ల కోసమే పోరాడారని స్పష్టం చేశారు.

 

ఇవి కూడా చదవండి: