Amazon Sale: ఇక పండగే పో.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధర భారీగా తగ్గింది.. దిమ్మతిరిగే డిస్కౌంట్లు..!

Rs 10,000 and more discount on Mobile in Amazon Sale: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. 200-మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ డీల్‌లో రూ. 10,000 వరకు తగ్గింపుతో రెండు అద్భుతమైన 200 మెగాపిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయచ్చు. మనం మాట్లాడుతున్న రెండు ఫోన్‌ల పేర్లు Vivo X200 Pro 5G, Xiaomi 15 Ultra. ఈ ఫోన్‌లను గొప్ప క్యాష్‌బ్యాక్‌తో కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు, కంపెనీ వీటిపై భారీ ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్ పరిస్థితి, దాని బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Xiaomi 15 Ultra
16GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర అమెజాన్‌లో రూ.1,09,998. జూన్ 30 వరకు, మీరు ఈ ఫోన్‌ను రూ. 10,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ పై రూ.3299 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు. దీనితో పాటు, కంపెనీ రూ. 58550 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఇస్తోంది. ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్‌లో మీకు నాలుగు కెమెరాలు లభిస్తాయి.
వీటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 200 మెగాపిక్సెల్ సూపర్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అలానే సెల్ఫీ కోసం, కంపెనీ ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ప్రాసెసర్‌గా ఉంటుంది. ఫోన్ బ్యాటరీ 5410mAh, ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
Vivo X200 Pro 5G
16GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ అమెజాన్ డీల్‌లో రూ.94999కి లభిస్తుంది. అమెజాన్ లిమిటెడ్ టైమ్ డీల్‌లో, మీరు జూన్ 30 వరకు రూ.7,000 వరకు తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. ఫోన్ పై రూ.2849 వరకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు రూ. 48,550 వరకు ప్రయోజనాన్ని పొందచ్చు.
ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, ఈ వివో ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 200-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్స్. ఈ ఫోన్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌లో పనిచేస్తుంది. దీనిలో మీకు 6000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది.