Women T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల.. ఆ రోజే ఇండియా Vs పాక్ మ్యాచ్!

Women’s T20 World Cup 2026 Schedule Out: మహిళల టీ20 వర్డల్ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ టోర్నీకి వచ్చే ఏడాది జూన్ 12వ తేదీన తెర లేవనుంది. ఐసీసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది.
మెగా ఈవెంట్లో 12 జట్లు భాగం కానున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాక్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతోపాటు గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో 4 జట్లు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించనున్నాయి. 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్, పాకిస్థాన్‌తోపాటు మరో 2 జట్లు గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు మరో రెండు టీంలు పోటీపడనున్నాయి.
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి న్యూజిలాండ్..
2024లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. టీ20 ప్రపంచకప్-2026 7 వేదికల్లో 24 రోజుల పాటు జరుగునుంది. మొత్తం 33 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడ్డింగ్లీ, ఓల్డ్ ట్రఫోర్డ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. జూన్ 12న ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ప్రారంభం కానుంది. జులై 5వ తేదీన లార్డ్స్‌లో ఫైనల్‌తో ప్రపంచ కప్ ముగియనుంది.
భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ అప్పుడే..
మెగా టోర్నీలో టీమ్ ఇండియా జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఢీకొట్టనుంది. జూన్ 14న హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం గ్లోబ్ క్వాలిఫయర్ నుంచి వచ్చిన టీంతో జూన్ 17న భారత్ జట్టు తలపడుతుంది. తర్వాత జూన్ 21న సౌతాఫ్రికాతో, జూన్ 25న క్వాలిఫయర్ జట్టుతో, జూన్ 28న ఆస్ట్రేలియా జట్టుతో టీమ్ ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 పూర్తి షెడ్యూల్..
జూన్ 12- ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక, ఎడ్జ్‌బాస్టన్
జూన్ 13- క్వాలిఫైయర్ వర్సెస్ క్వాలిఫైయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ మైదానం
జూన్ 13- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ మైదానం
జూన్ 13- వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్, హాంప్‌షైర్ బౌల్
జూన్ 14- క్వాలిఫైయర్ వర్సెస్ క్వాలిఫైయర్, ఎడ్జ్‌బాస్టన్
జూన్ 14- ఇండియా వర్సెస్ పాక్, ఎడ్జ్‌బాస్టన్
జూన్ 16- న్యూజిలాండ్ వర్సెస్ శ్రీలంక, హాంప్‌షైర్ బౌల్
జూన్ 16- ఇంగ్లండ్ వర్సెస్ క్వాలిఫయర్, హాంప్‌షైర్‌బౌల్
జూన్ 17- ఆస్ట్రేలియా వర్సెస్ క్వాలిఫయర్, హెడ్డింగ్లీ
జూన్ 17- ఇండియా వర్సెస్ క్వాలిఫయర్, హెడ్డింగ్లీ
జూన్ 17- సౌతాఫ్రికా వర్సెస్ పాక్, ఎడ్జ్‌బాస్టన్
జూన్ 18- వెస్టిండీస్ వర్సెస్ క్వాలిఫయర్, హెడ్డింగ్లీ
జూన్ 19- న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్
జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్
జూన్ 20- ఇంగ్లండ్ వర్సెస్ క్వాలిఫయర్, హెడ్డింగ్లీ
జూన్ 21- వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక, బ్రిస్టల్ కౌంటీ మైదానం
జూన్ 23- న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్
జూన్ 23- శ్రీలంక వర్సెస్ క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్
జూన్ 23- ఆస్ట్రేలియా వర్సెస్ పాక్, హెడ్డింగ్లీ
జూన్ 24- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్, లార్డ్స్ క్రికెట్ మైదానం
జూన్ 25- ఇండియా వర్సెస్ క్వాలిఫయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ మైదానం
జూన్ 25- సౌతాఫ్రికా వర్సెస్ క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ మైదానం
జూన్ 26- శ్రీలంక వర్సెస్ క్వాలిఫయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ మైదానం
జూన్ 27- పాక్ వర్సెస్ క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ మైదానం
జూన్ 27- వెస్టిండీస్ వర్సెస్ క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ మైదానం
జూన్ 27- ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్, ది ఓవల్
జూన్ 28- సౌతాఫ్రికా వర్సెస్ క్వాలిఫయర్, లార్డ్స్ క్రికెట్ మైదానం
జూన్ 28- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా, లార్డ్స్ క్రికెట్ మైదానం
జూన్ 30- సెమీ ఫైనల్ 1- ది ఓవల్
జూలై 2- సెమీ ఫైనల్ 2- ది ఓవల్
జూలై 5- ఫైనల్, లార్డ్స్ క్రికెట్ మైదానం