Gun Fire in Mexico: మెక్సికోలో కాల్పులు.. 12 మంది మృతి!

12 killed in Gun Fire in Mexico: మెక్సికో మరోసారి దద్దరిల్లింది. గ్వానాజువాటలోని ఇరాపువాటో పట్టణంలో కొంతమంది దుండగులు కాల్పులు చేశారు. రాత్రి జరిగిన స్ట్రీట్ ఫెస్టివల్‌లో కాల్పులకు తెగబడగా.. 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఈ కాల్పుల్లో మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అయితే, ఈ ఘటనపై మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షిన్ బామ్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని చెప్పారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ కొనసాగిస్తున్నారు.