Karun Nair Injured: భారత స్టార్ క్రికెటర్‌కు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్!

Karun Nair Injured before Before England Test: భారత స్టార్ క్రికెటర్ కరుణ్ నాయర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో బంతి నేరుగా కీలక బ్యాటర్ కరుణ్ నాయర్‌కు తగిలింది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బ్యాటింగ్ ఆడేందుకు కరుణ్ నాయర్ చాలా ఇబ్బంది పడ్డాడు. వైద్యులు పరిశీలించగా.. పక్కటెముకలకు గాయం తగిలినట్లు వెల్లడించారు.
అయితే కాసేపటి వరకు ఇబ్బంది పడిన కరుణ్ నాయర్.. మళ్లీ బ్యాటింగ్ చేసేందుకు ఆసక్తి కనబర్చాడు. కాగా, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడడం కరుణ్ నాయర్‌కు చాలా కీలకమైంది. అంతకుముందు 2017లో చివరిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడగా.. మళ్లీ అవకాశం వచ్చింది. ముఖ్యంగా దేశవాళీ క్రికెట్‌లో మంచిగా ఆడడంతో సెలక్టర్లు అతడిని ఎంచుకున్నారు.
ఇదిలా ఉండగా, దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత కరుణ్ నాయర్ ఇండియా తరఫున ఆడుతున్నాడు. ఆయనకు కౌంటీ క్రికెట్ ఆడిన ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. 2023, 2024 కౌంటీ ఛాంపియన్ షిప్ సీజన్‌లలో ఆడాడు. నార్తాంప్టన్ షైర్ జట్టు తరఫున 10 మ్యాచ్‌లు ఆడగా.. 736 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ కూడా నమోదు చేశాడు. అంతే కాకుండా రంజీ ట్రోఫీలో విదర్భ జట్టుకు 2024, 2025 ఏళ్లల్లో 16 మ్యాచ్‌లలో 863 రన్స్ చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేశాడు.
ఇక, ఇంగ్లండ్‌తో సిరీస్ కోసం భారత జట్టు ప్లెయింగ్ ఎలెవన్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంగ్లండ్ తొలి టెస్ట్ కోసం తన జట్టును ప్రకటించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది.
ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్(కెప్టెన్), జాక్ క్రౌలీ, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోస్ టంగ్, షోయబ్ బషీర్.
భారత్ జట్టు: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్, ప్రమోద్, ఆకాష్ దీప్, అర్ష్ దీప్ సింగ్, కుల్ దీప్ యాదవ్.
ఇవి కూడా చదవండి:
- Women T20 World Cup 2026: మహిళల టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల.. ఆ రోజే ఇండియా Vs పాక్ మ్యాచ్!