India vs Bangladesh: ఛాంపియన్స్ ట్రోఫీ.. టాస్ ఓడిన భారత్.. జట్టు ఇదే!

Bangladesh own the toss and choose to bat in champions trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ భారత్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ శాంటో బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. అయితే పిచ్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఆసక్తికరంగా మారింది. ఈ పిచ్ తయారీలో తనకు ఏ జట్టు నుంచి రిక్వెస్టులు రాలేదని ఈ పిచ్‌ల క్యూరేటర్ మాథ్యూ సాండ్రే తెలిపాడు. అయితే పిచ్‌పై నిలకడగా బౌన్స్ ఉండే అవకాశం ఉందని వెల్లడించాడు.
భారత్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమీ, హర్షిత్ రాణా.
బంగ్లాదేశ్ జట్టు:
నజ్ముల్ హుస్సేన్ శాంటో(కెప్టెన్), తంజిద్ హసన్, సౌమ్య సర్కార్, తౌహిద్ హృదోయ్, మెహిదీ మిరాజ్, ముష్ఫికర్ రహీం(వికెట్ కీపర్), రిషద్ హుసేన్, జకేర్ అలీ, తన్జిమ్ హసన్, తస్కిన్, ముస్తాఫిజుర్.