Published On:

Anirudh – Kavya Maran Wedding: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్‌ కావ్యతో అనిరుధ్‌ పెళ్లి..?.. క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌!

Anirudh – Kavya Maran Wedding: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్‌ కావ్యతో అనిరుధ్‌ పెళ్లి..?.. క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌!

Anirudh Ravichander and Kavya Maran Wedding Rumors Goes Viral: కోలీవుడ్‌ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న వయసులో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎదిగాడు. కంపోజింగ్‌ మాత్రమే కాదు.. తనదైన గాత్రంలో శ్రోతలను సైతం అలరిస్తుంటాడు. అగ్ర హీరోల సినిమాల్లో టైటిల్‌ సాంగ్స్‌ పాడి ఆకట్టుకుంటున్నాడు. కోలీవుడ్‌, టాలీవుడ్‌లో అత్యంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్న ఈ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తరయూ డేటింగ్‌ రూమర్స్‌ వార్తల్లో నిలుస్తుంటాడు.

 

గతంలో నటి ఆండ్రియా, కీర్తి సురేష్‌లతో డేటింగ్, పెళ్లి రూమర్సలో వార్తల్లో నిలిచాడు. అయితే అవి కేవలం ప్రచారానికి మిగిలాయి. ఇప్పుడు తాజాగా మరో సరికొత్త రూమర్‌ తెరపైకి వచ్చింది. ఈసారి అనిరుధ్‌ పెళ్లంటూ ప్రచారం మొదలైంది. అదీ కాడు ఐపీఎల్‌ ఫ్రాంచైజ్‌ ఓనర్‌తో అట. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌ మీడియాలో, సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకి ఈ వార్తల సారాంశం ఏంటంటే.. అనిరుధ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజ్ సీఈవో కావ్య మారన్‌లు కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారట.

 

ఇక ఇప్పుడు వీరు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారంటూ తెగ ప్రచారం జరుగుతుంది. 2014 నుంచి వీరు ప్రేమలో ఉన్నారట.. అయితే ఇది బయటకు రాకుండ ఇంతకాలం సైలెంట్‌గా మెయింటైన్‌ చేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళ మీడియాలో ఈ రూమర్‌ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. ఇది కాస్తా అనిరుధ్‌ చెవిన పడిందట. దీంతో ఈ పెళ్లి రూమర్స్‌ అతడు ఖండించినట్టు తెలుస్తోంది. ‘పెళ్లా..! రూమర్స్‌ ప్రచారం ఆపండి’ అంటూ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి దీనిపై ఎస్‌ఆర్‌హెచ్‌ ఓనర్ కావ్య నుంచి రియాక్షన్‌ వస్తుందోనని ఆసక్తిగాఎదురుచూస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, సన్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ కళానిధి కుమార్తె కావ్య మారన్‌.

 

కళానిధి నిర్మించిన జైలర్‌, బీస్ట్‌, రాయన్‌ వంటి తదితర సినిమాలకు అనిరుధ్‌ సంగీ దర్శకుడిగా వ్యవహిరించిన సంగతి తెలిసిందే. కావ్య మారన్‌కు సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది. హైదరాబాద్‌ జట్టు ప్రతి మ్యాచ్‌కి హాజరై ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతారు. అలాగే కీలక టైంలో బిగ్‌ షాట్‌, వికెట్స్‌కి ఆమె పలికించే హావభావాలు సోషల్‌ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటాయి. ముఖ్యంగా ఆమె చిన్న పిల్లల బుంగమూతి పెట్టే విధానం, జట్టు గెలుపు టైంలో ఆమె ఆనందంతో చేసే అల్లరికి మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ముఖ్యంగా కావ్య నవ్వితే.. మేడమ్‌ సార్‌ మేడమ్‌ అంతే అని ప్రతి ఒక్కరు అనాల్సిందే. అంతగా సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌, పాపులారిటి సంపాదించుకుంది ఈ భామ.