India vs Pakistan: భారత్‌తో మ్యాచ్.. పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్

Fakhar Zaman ruled out of ahead of India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడగా.. పాకిస్థాన్ 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తాజాగా, పాకిస్థాన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీన భారత్‌తో పాకిస్థాన్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్ కీలక ఆటగాడు ఫఖర్ జమాన్ దూరం కానున్నాడు. గాయం కారణంగా భారత్‌తో ఆడే అవకాశం లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
తొలి మ్యాచ్‌లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో ఆడుతుండగా.. ఫిల్డింగ్ చేస్తున్న సమయంలో ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. దీంతో ఆయన స్థానంలో సౌద్ షకీల్ ఓపెనర్‌గా వచ్చాడు. మరో వైపు, గాయం తీవ్రత ఎక్కువ ఉండడంతో జమాన్‌కు విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో 23న దుబాయ్‌లో భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఉన్నందున.. జమాన్ వెళ్లకపోవడంతో అతని స్థానంలో ఇమామ్ ఉల్ హక్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.