Last Updated:

Vimanam Movie Review : సముద్రఖని, మీరా జాస్మిన్, అనసూయ నటించిన “విమానం” మూవీ రివ్యూ..!

Vimanam Movie Review : సముద్రఖని, మీరా జాస్మిన్, అనసూయ నటించిన “విమానం” మూవీ రివ్యూ..!

Cast & Crew

  • స‌ముద్రఖ‌ని (Hero)
  • . (Heroine)
  • అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధనరాజ్, రాజేంద్ర‌న్ తదితరులు (Cast)
  • శివ ప్రసాద్ యానాల (Director)
  • జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (Producer)
  • చరణ్ అర్జున్ (Music)
  • వివేక్ కాలేపు (Cinematography)
2.5

Vimanam Movie Review : స‌ముద్ర ఖ‌ని, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌ మెయిన్ లీడ్ గా నటించిన సినిమా “విమానం”. అలానే మీరా జాస్మిన్‌, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. చ‌ర‌ణ్ అర్జున్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని జీ స్టుడియోస్ తో కలిసి కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో సముద్రఖని వికలాంగునిగా, ఆయన కుమారుడిగా మాస్టర్ ధ్రువన్ నటించారు. అనసూయ వేశ్య పాత్ర పోషించారు. కొంత విరామం తర్వాత మీరా జాస్మిన్ ఈ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, టైలర్ లు చూస్తే ఖచ్చితంగా ఒక ఎమోషనల్ జర్నీ పక్కా అని అందరికీ అనిపిస్తుంది. మరి ఈ క్రమం లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా నేడు (జూన్ 9న) రిలీజ్ అయ్యింది. ఈ తరుణంలో ఈ సినిమా రివ్యూ, రేటింగ్ మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ..

వీరయ్య (సముద్రఖని) ఓ చిన్న వాడలో సులభ్ కాంప్లెక్స్ పెట్టుకుని బతుకుతుంటాడు. అతను వికలాంగుడు. కుమారుడు రాజు (‘మాస్టర్’ ధ్రువన్)కు జన్మనిచ్చిన తర్వాత భార్య మరణిస్తుంది. వారసత్వంగా వచ్చిన సులభ్ కాంప్లెక్స్ అతని జీవనాధారం. అబ్బాయే అతని జీవితం. రాజు ఎంతో తెలివైన వాడు.. స్కూల్లో చాలా చురుగ్గా ఉంటాడు. అయితే ఆ కుర్రాడికి చిన్నప్పటి నుంచి విమానం ఎక్కాలనే కోరిక బలంగా ఉంటుంది. దానికోసమే బతుకుతుంటాడా అనేంత ఇష్టం. అదే వాడలో చెప్పులు కుట్టుకునే కోటి (రాహుల్ రామకృష్ణ), డ్రైవర్ డానీ (ధన్ రాజ్), వ్యభిచారం చేసుకునే సుమతి (అనసూయ భరద్వాజ్) కూడా ఉంటారు. తల్లి చిన్నపుడే చనిపోవడంతో కొడుకును ప్రాణంగా చూసుకుంటాడు వీరయ్య. అయితే అబ్బాయికి లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) ఉందని తెలియడంతో ఎలాగైనా విమానం ఎక్కించాలని వీరయ్య నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వీరయ్య జీవితంలో బస్తీలో వేశ్య సుమతి (అనసూయ), చెప్పులు కుట్టే కోటి (రాహుల్ రామకృష్ణ), ఆటో డ్రైవర్ డేనియల్ (ధనరాజ్) పాత్రలు ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

మూవీ విశ్లేషణ (Vimanam Movie Review)..

‘విమానం’లో మంచి కథ, అంతకు మించి కంటతడి పెట్టించే భావోద్వేగభరిత సన్నివేశాలు ఉన్నాయి. అయితే, ఆ కథను ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేసే కథనం కొరవడింది. సినిమాలో క్యారెక్టర్లు తక్కువ ఉన్నాయి. పరిమిత పాత్రలతో కథ ముందుకు నడిచేటప్పుడు సీన్లు ఎంత క్రిస్పీగా ఉంటే.. స్క్రీన్ ప్లే ఎంత ఫాస్ట్‌గా ఉంటే.. ప్రేక్షకుడు అంతలా కనెక్ట్ అవుతాడు. కథలో లీనం అవుతాడు. లీనమయ్యేలా చక్కని కథనంతో సినిమాను నడిపించడంలో దర్శకుడు శివ ప్రసాద్ యానాల తడబడ్డారు. ‘విమానం’ ప్రారంభంలో తండ్రి కుమారుల మధ్య, వాళ్ళతో ఆ బస్తీ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించడంలో దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నారు. అనసూయ, రాహుల్ రామకృష్ణ మధ్య సన్నివేశాలు బావున్నాయి. అయితే, కథలో భాగంగా ముందుకు తీసుకువెళితే మరింత బావుండేది. అయితే.. రాహుల్ రామకృష్ణ ఇంట్లో సీన్ అవాయిడ్ చేస్తే బావుండేది. ఎమోషనల్ కథలో పంటికింద రాయిలా ఆ సీన్ తగులుతుంది. స్కూల్ లో సన్నివేశాలు చిన్నారుల అమాయకత్వాన్ని చూపెడుతూ నవ్విస్తాయి.

ఇంటర్వెల్ దగ్గర క్లైమాక్స్ ఎలా ఉంటుందనే ఐడియా ప్రేక్షకులకు వస్తుంది. అందువల్ల, కథనం పెద్దగా ఆసక్తి కలిగించదు. అయితే, ప్రేక్షకులు ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ క్లైమాక్స్‌లో ఇచ్చారు. (థియేటర్లలో లేదంటే ఓటీటీలో అయినా సరే సినిమా చూడాలనుకుంటే సోషల్ మీడియాలో స్పాయిలర్స్ చదవకండి. ఎండింగ్ పాయింట్ (ట్విస్ట్) తెలిస్తే.. సినిమా చూసేటప్పుడు ఆ ఫీల్ ఖచ్చితంగా మిస్ అవుతుంది )

ఎవరెలా చేశారంటే.. 

తండ్రి పాత్రకు సముద్రఖని పూర్తి న్యాయం చేశారు. మాస్టర్ ధ్రువన్ నటనలో అమాయకత్వం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య భావోద్వేగభరిత సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. థియేటర్లలో ప్రేక్షకులు సైతం ఎమోషనల్ అవుతారు. అయితే.. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు గుర్తు చేసుకునే మరో నటి అనసూయ. వేశ్య పాత్ర సుమతిగా అనసూయ మరోసారి తన నటనతో అబ్బురపరిచారు. రాహుల్ రామకృష్ణ, ధన్ రాజ్ కారెక్టర్స్ బాగున్నాయి. ముఖ్యంగా రాహుల్ కారెక్టర్‌లో డబుల్ మీనింగ్ కూడా బాగానే ఉన్నాయి. మీరా జాస్మిన్ నటించడం వల్ల ఎయిర్ హోస్టెస్ పాత్రకు హుందాతనం వచ్చింది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కాస్త బెటర్‌గా ఉండాల్సింది. దర్శకుడిగా శివ ప్రసాద్ మంచి కథ రాసుకున్నాడు కానీ కథనం కూడా అంతే బాగా ఉండుంటే బలగం స్థాయిలో విమానం చాలా మంచి సినిమా అయ్యుండేది.

కంక్లూజన్.. 

స్లో గా టేకాఫ్ అయినా .. కరెక్ట్ గా ల్యాండ్ అయిన ‘విమానం’

ఇవి కూడా చదవండి: