Anasuya Bharadwaj: దమ్ముంటే పైకి రారా.. ఆంటీ కొంచెం ఓవర్ గా లేదు

Anasuya Bharadwaj: హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్.. ఎక్కడ ఉంటే అక్కడ కచ్చితంగా రచ్చే. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. నెమ్మదిగా వెండితెరపై కీలక పాత్రల్లో నటిస్తూ స్టార్ గా మారింది. ఆ తరువాత హీరోయిన్ గా, ఐటెంసాంగ్స్ చేస్తూ మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారింది.
ఇక అనసూయ సినిమాల సంగతి పక్కన పెడితే.. వివాదాల్లో ఆమె ఎప్పుడు ముందే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా ఆమెను ఆంటీ అని పిలిస్తే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. తనను ఆంటీ అని పిలిచినవారిపై ఆమె కేసులు కూడా పెట్టింది. మంచి ఉద్దేశ్యంతో ఆంటీ అని పిలిస్తే పర్లేదు కానీ, మనసులో చెడు ఉద్దేశ్యాలు పెట్టుకొని.. వేరేవిధంగా ఆలోచిస్తూ ఆంటీ అని పిలిచేవారంటే తనకు కోపం అని అనసూయ ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా అనసూయ ఆంటీ వివాదంపై మరోసారి మండిపడింది. నిన్న హోళీ వేడుకలో భాగంగా ఆమె ఒక ఈవెంట్ కు హాజరయ్యింది. అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూ.. అనసూయ రావడమే ఆంటీ అని పిలిచారు. దీనికి అనసూయ శివాలెత్తింది. చుట్టూ జనాలు ఉన్నారు అని కూడా చూడకుండా ఆమె మైక్ లోనే అందరిముందు తనను ఆంటీ అని పిలిచినవారిపై ఫైర్ అయ్యింది.
నన్ను ఆంటీ అని పిలుస్తావా.. ? స్టేజిపైన ఏం జరుగుతుందో నీకు తెలుసా.. ? దమ్ముంటే పైకి రారా.. అతన్ని పైకి పంపండి. రా పైకి చూసుకుందాం. ఏంటి భయపడుతున్నావా.. ప్యాంట్ తడిచిపోయిందా.. ? అంటూ ఇష్టానికి మాట్లాడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఏంటి.. ఆంటీ ఇది కొంచెం ఓవర్ గా అనిపించడం లేదు. అందరిముందు ధమ్కీ ఇస్తున్నావ్. సెలబ్రిటీ అని పొగరా.. ? అంతో కామెంట్స్ పెడుతున్నారు.