Last Updated:

Riyadh: 103,000 ఉద్యోగాలు.. 120 మిలియన్ల పాసింజర్లు లక్ష్యంగా రియాద్ లో కొత్త ఎయిర్ పోర్టు

సౌదీ అరేబియా శరవేగంగా రూపాంతరం చెందుతోంది. మధ్యయుగం నాటి ఏడారి ప్రాంతమైన బెడయూన్‌ సమాజం నుంచి 21వ శతాబ్దంలోకి అత్యాధునిక సమాజంగా మారబోతోంది. ప్రస్తుతం సౌదీ కింగ్‌ ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌ )విజన్‌ 2030ని శరవేగంగా అమలు చేయాలని పట్టుదలతో ఉన్నారు.

Riyadh: 103,000 ఉద్యోగాలు.. 120 మిలియన్ల పాసింజర్లు లక్ష్యంగా రియాద్ లో కొత్త ఎయిర్ పోర్టు

Riyadh: సౌదీ అరేబియా శరవేగంగా రూపాంతరం చెందుతోంది. మధ్యయుగం నాటి ఏడారి ప్రాంతమైన బెడయూన్‌ సమాజం నుంచి 21వ శతాబ్దంలోకి అత్యాధునిక సమాజంగా మారబోతోంది. ప్రస్తుతం సౌదీ కింగ్‌ ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ (ఎంబీఎస్‌ )విజన్‌ 2030ని శరవేగంగా అమలు చేయాలని పట్టుదలతో ఉన్నారు. సౌదీ అరేబియాను ఆయిల్‌ ఎకానమీ నుంచి టూరిస్టు ఎకానమీగా మార్చాలని ప్రణాళికలు రూపుదిద్దుతున్నారు. సంప్రదాయ ఇంధనం స్థానంలో రాబోయే సంవత్సరాల్లో ప్రపంచంమొత్తం పత్ర్యామ్నయ ఇంధనానికి మారిపోతోంది. వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి పెట్రోల్‌, డిజిల్‌ వినియోగం ప్రపంచం మొత్తం తగ్గించుకోబోతోంది. దీంతో ముందు చూపుతో ఎంబీఎస్‌ మొత్తం చమురుపై ఆధారపడకుండా .. చమురేతర ఆదాయంపై దృష్టి పెడుతున్నారు.

దీని కోసం ఆయన వందలాది బిలియన్‌ డాలర్లు పెట్టుబడులు పెట్టి కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఆయనకు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. దీంతో ఆయన పన్ను ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఆయన ఆయుధాల కొనుగోలును కూడా క్రమంగా తగ్గించుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేసుకుంటున్నారు. దేశీయ పర్యాటక రంగంతో పాటు అంతర్జాతీయ పర్యాటకుల నుంచి పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తున్నారు. ఆయనను చూసి ఇతర ఇస్లామిక్‌ దేశాలు కూడా ఆయన బాట పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఎంబీఎస్‌ కొత్తగా కింగ్‌ సల్మాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుల వల్ల సుమారు లక్షా 3వేల మందికి ఉపాధి లభిస్తుంది. కొత్త ఎయిర్‌పోర్ట్‌ వల్ల రియాద్‌ నగరం రవాణా, వాణిజ్య, టూరిజానికి గ్లోబల్‌ డెస్టినేషన్‌గా .ఈస్ట్‌ అండ్‌ వెస్ట్‌కు కనెక్టింగ్‌ బ్రిడ్జిగా మారనుంది. కాగా సౌదీ అరేబియా క్రౌన్‌ ప్రిన్స్‌ మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సోమవారం నాడు కొత్తగా కింగ్‌ సల్మాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టును రియాద్‌లో నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. 2030 నాటికి 120 మిలియన్‌ ప్యాసింజర్లు ఈ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించవచ్చునని ఆయన అన్నారు. కొత్త విమానాశ్రయం ద్వారా రియాద్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ట్రేడ్‌, టూరిజానికి గ్లోబల్‌ డెస్టినేషన్‌ అవుతుందన్నారు.

దీంతో పాటు ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్‌పోర్టు అవుతుందని, ఏడాదికి 120 మిలియన్‌ ప్యాసింజర్లు రాకపోకలు సాధించగలిగే స్థాయికి చేరుతుందన్నారు. అలాగే 2050 నాటికి 185 మిలియన్‌ ప్యాసింజర్లు, 3.5 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయగలిగే స్థాయికి ఎదుగుతుందని సౌదీ ప్రెస్‌ ఎజెన్సీ తెలిపింది. కాగా ఈ ఎయిర్‌పోర్ట్‌ ఎల్‌ఈఈడి ప్లాటినం సర్టిఫికేట్‌ కోసం ప్రయత్నిస్తామని వెల్లడించింది. పర్యావరణానికి అనుకూలంగా ఉండే ప్రాజెక్టు కాబట్టి రెన్యూవబుల్‌ ఎనర్జీని వినియోగిస్తామని సౌదీ ప్రెస్‌ వివరించింది. విమానాశ్రయం విషయానికి వస్తే సుమారు 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. వీటిలోనే ఆరు రన్‌వేలు, 12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సపోర్టు ఫెసిలిటి. రెసిడెన్షియల్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌, కమర్షియల్‌ ఎస్సెట్స్‌ను అందుబాటులోకి తెస్తాయి. కొత్త ఎయిర్‌ పోర్ట్‌ నిర్మాణం వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా 1,03,000 మందికి ఉపాధి లభిస్తుంది.

ఈ ప్రాజెక్టు పూర్తయితే కింగ్‌డమ్‌కు చమురేతర రెవెన్యూ ఏడాదికి 7 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూర్చే అవకాశం కనిపిస్తోంది. కాగా ఈ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం విషయానికి వస్తే సౌదీ పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ స్ర్టాటజీ కింద లాభదాయకమైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతుంది. ముఖ్యంగా రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, స్థానిక మౌలికరంగం అభివృద్ది ప్రాజెక్టులపై పెట్టుబడులు పెడుతోంది. కాగా ఎంబీఎస్‌ ప్రధాన ఉద్దేశం మాత్రం రాబోయే సంవత్సరాల్లో చమురు ద్వారా వచ్చే రెవెన్యూ గణనీయంగా తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పెట్రోల్‌కు బదులు బ్యాటరీ కార్లు వాడతారు. అప్పుడు చమురుకు డిమాండ్‌ పూర్తిగా తగ్గిపోతుంది.

అందుకే ముందు చూపుతో ఆయన రెవెన్యూ పెంచుకోవడానికి కొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు. అమెరికాలో లాస్‌ వేగస్‌లా ఇక్కడ రియాద్‌లో అలాంటి నగరాన్ని సృష్టించి పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించాలనుకుంటున్నారు. లాస్‌ వేగస్‌ విషయానికి వస్తే మొత్తం ఎంటర్‌టెయిన్‌మెంట్‌, గ్యాంబ్లింగ్‌పై ఆధారపడి ఉంటుంది. యూరప్‌ నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు అమెరికాకు వెళ్తుంటారు. అలాంటి నగరాన్నే ఎంబీఎస్‌ ప్లాన్‌ చేసి ప్రపంచంలోని ఇతర దేశాల పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాలనుకుంటున్నారు. దీని ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం సంపాదించుకోవాలని చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి: