Last Updated:

Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ఇచ్చిన జనసైనికులు

Ambati Rambabu: మంత్రి అంబటి రాంబాబుకు షాక్ ఇచ్చిన జనసైనికులు

Ambati Rambabu:  సత్తెన పల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) కోర్టు షాక్ ఇచ్చింది. అంబటి పై కేసు నమోదు చేయాలని పోలీసులకు గుంటూరు జిల్లా కోర్టు ఆదేశించింది. సంక్రాంతి సందర్బంగా అంబటి నేత్రుత్వంలో ‘వెఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా’ పేరుతో టికెట్లు అమ్ముతున్నారని జనసేన నేతలు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. స్వయంగా మంత్రి అంబటి లక్కీ డ్రా టికెట్లు కొనాలని పబ్లిక్ గా ప్రకటించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ నుంచి పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులను టార్గెట్ చేసి టికెట్లు అమ్ముతున్నారని తెలిపారు.

అయితే పోలీసులు కేసును స్వీకరించకపోవడంతో నేతలు కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేశారు. మంత్రి అంబటి లాటరీ టికెట్ల కోసం ప్రచార చేసిన వీడియోను కోర్టుకు సమర్పించారు. రాష్టంలో లాటరీ వ్యాపారానికి పర్మిషన్ లేకపోయినా.. ఇలా గిఫ్ట్ పేరుతో టికెట్లు విక్రయిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన న్యాయమూర్తి ఘటనకు సంబంధించి వెంటనే అంబటి పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

గతంలోనూ ఆరోపణలు..

గతంలో కూడా అంబటి పై సొంత నియోజక వర్గంలో పలు ఆరోపణలు వచ్చాయి. స్థానిక ఉండే ఓ కుటుంబానికి వచ్చిన ప్రభుత్వ పథకం లో వాటా అడిగారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అది మరువక ముందే మళ్లీ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో ఇంకో వివాదంలో అంబటి చిక్కుకున్నారు. సత్తెన పల్లి నియోజక వర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి అంబటి స్థానిక జనసేన నేతలను టార్గెట్ చేస్తున్నారు. తాజా ఘటనను సీరియస్ తీసుకున్న జనసేన నేతలు అంబటి పై కోర్టు కేసు దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి…

3200 కిలో మీటర్ల నదీ విహారం.. గంగా విలాస్ అద్భుత యాత్ర

నీకో స్పెషల్ గిఫ్ట్.. రిపోర్టర్ ను సర్ ప్రైజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

లారస్ ల్యాబ్స్ ప్రమాదం: సీఎం జగన్ ప్యాకేజ్ స్టార్.. ఇది శవాలపై పేలాలు ఏరుకోవడం కాదా..?

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: