Published On:

Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచి అంటే?

Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తేదీలు ఖరారు.. ఎప్పటి నుంచి అంటే?

Monsoon session of Parliament from July 21 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగుతాయని పార్లమెంట్ వ్యవహారాల విభాగం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో పహల్గాం టెర్రక్ అటాక్ ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సాధారణ సమావేశాలపై ప్రకటన వెలువడం గమనార్హం.

 

సమావేశాల్లో పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌‌పై తెలిసింది. 23 రోజులపాటు సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాల్లో కీలకమైన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిగతులపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

ప్రధానికి ఎంపీల లేఖ..
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట పాకిస్థాన్ వైమానిక స్థావరాలను తుత్తునియలు చేసింది. మన ఆర్మీ విజయం ముంగిట ఉందనగా, మోదీ సర్కారు కాల్పుల విరమణకు అంగీకరించింది. దీంతో వ్యవహారంపై యావత్ జాతి జనుల్లో ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ప్రధాని మోదీపాటు ప్రభుత్వ పెద్దలు ఎవరూ నోరుమెదపడం లేదు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన, అనంతరం చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చించేందుకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపక్షానికి చెందిన 16 పార్టీల ప్రతినిధులు ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు. లేఖపై 200 మందికి పైగా విపక్ష ఎంపీలు సంతకాలు చేశారు.

ఇవి కూడా చదవండి: