Jeedimetla: 3గంటల్లో పార్కును కాపాడిన హైడ్రా.!

BreakingNews: ఓ పార్కును కబ్జా చేశారని ఫిర్యాదు చేసిన 3గంటల్లోనే సమస్యకు హైడ్రా పరిష్కారం చూపింది. కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలోని జీడిమెట్లలోని రుక్కిణి ఎస్టేట్‌కు చెందిన ఓ పార్కును కొందరు వ్యక్తులు కబ్జా చేశారు. ఈ కబ్జాలు తొలగించాలని రుక్మిణి ఎస్టేట్స్ రెసిడెన్షియల్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్‌కు ఫోన్ చేసి ఆక్రమణలు తొలగించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. మధ్యాహ్నం ఫిర్యాదు చేస్తే.. సాయంత్రానికి హైడ్రా అధికారులు రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించారు. అంతేకాకుండా పార్కు ప్రొటెక్టెడ్ బై హైడ్రా అనే బోర్డును ఏర్పాటు చేశారు. హైడ్రా అధికారులు తీసుకున్న చర్యలను స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు.