Published On:

CM Convoy Break Down: సీఎం కాన్వాయ్‌లోని 19 కార్లు ఒకేసారి బ్రేక్‌డౌన్.. విషయం తెలిసి అధికారులు షాక్

CM Convoy Break Down: సీఎం కాన్వాయ్‌లోని 19 కార్లు ఒకేసారి బ్రేక్‌డౌన్.. విషయం తెలిసి అధికారులు షాక్

Madhya Pradesh CM Mohan Yadav: మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కు మార్గమధ్యంలో అనూహ్యంగా ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కాన్వాయ్‌లోని 19 వాహనాలు ఒకదాని వెంట మరొకటి రోడ్డుపై నిలిచిపోయాయి.

 

సీఎం షెడ్యూల్ ప్రకారం రత్నాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి శుక్రవారం బయలుదేరారు. కొంతదూరం వెళ్లిన తర్వాత 19 ఎస్‌యూవీలతో కూడిన కాన్వాయ్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో వాహనాలు జర్క్‌లు ఇస్తూ నిలిచిపోయాయి. వాహనాలను నెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఆన్ కాలేదు. దీంతో మరో ప్రత్యేక వాహనంలో ముఖ్యమంత్రి ముందుకు సాగారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని వాహనాలు రోడ్డుపై మొరాయించడానికి స్థానిక పెట్రోల్ పంప్‌లో డీజిల్‌ కల్తీ కావడమే కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు.

 

మొదట ఒకటి, రెండు కార్లలో సమస్య తలెత్తినా తర్వాత అన్ని వాహనాలు నిలిచిపోయినట్లు డ్రైవరు శుభం వర్మ తెలిపారు. స్థానిక పెట్రోల్ పంప్‌లో 350 లీటర్ల డీజిల్ నింపామని పేర్కొన్నారు. కల్తీకి అవకాశం లేదని సిబ్బంది చెబుతున్నారని తెలిపారు. స్థానిక యువకుడు ఒకరు ఇదే పెట్రోల్ పంప్ నుంచి నింపుకున్న డీజిల్‌లో వాటర్ లేయర్లు కనిపించాయి. దీంతో ఫుడ్ అండ్ సివిల్ సప్లై అధికారులు డీజిల్ శాంపుల్స్‌ను సేకరించి తనిఖీలు చేపట్టారు. శాంపుల్స్‌లో నీళ్లు కలిసినట్లు గుర్తించారు. ఘటనపై విచారణ జరిపి సమగ్ర నివేదికను రత్లాం కలెక్టర్‌కు అందజేస్తామని ఫుడ్ డిపార్ట్‌మెంట్ అధికారి ఆనంద్ గోలే తెలిపారు. ప్రస్తుతం పెట్రోల్ పంప్‌ను అధికారులు సీజ్ చేశారు.

 

ఇవి కూడా చదవండి: