Home / Parliament
18వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. మూజువాణీ ఓటుతో ఆయన ప్రతిపక్ష కూటమి అభ్యర్ది కె. సురేష్ పై గెలుపొందినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా ఓం బిర్లాను స్పీకర్ చైర్ వరకు తీసుకుని వెళ్లారు.
18వ లోక్ సభకు ఎన్నికయిన పార్లమెంటు సభ్యుల ప్రమాణస్వీకారం నేడు జరిగింది. ఈ సందర్బంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలుగులో ప్రమాణ స్వీకారం చేసారు
లోక్‌సభలో గతవారం చోటు చేసుకున్న భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు పట్టు వీడటం లేదు. విపక్షాల నిరసనలతో సోమవారం కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. ఉభయ సభల్లో కలిపి మొత్తంగా 92మందిపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్‌సభలో ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌధరి సహా 47మందిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
పార్లమెంటులో ఇజ్రాయెల్‌ను విమర్శిస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయిన టర్కీ ఎంపీ హసన్ బిట్మెజ్ గురువారం మరణించారు. ప్రతిపక్ష ఫెలిసిటీ (సాడెట్) పార్టీకి చెందిన 54 హసన్ బిట్మెజ్ ఏళ్ల అంకారా సిటీ ఆసుపత్రిలో మరణించారని టర్కీ ఆరోగ్య మంత్రి ఫహ్రెటిన్ కోకా తెలిపారు.బిట్మెజ్ సెంటర్ ఫర్ ఇస్లామిక్ యూనియన్ రీసెర్చ్ చైర్మన్ మరియు గతంలో ఇస్లామిక్ ప్రభుత్వేతర సంస్థల కోసం పనిచేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పార్లమెంటు పొగ కలకలం వెనుక ప్రధాన సూత్రధారి లలిత్ ఝా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీకి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్ననీమ్రానాలో అతను చివరిసారిగా కనిపించినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను 15 మంది విపక్ష ఎంపీలను మిగిలిన సెషన్‌కు సస్పెండ్ చేస్తూ లోక్‌సభ ఈరోజు తీర్మానం చేసింది. సస్పెండ్ అయిన 15 మందిలో తొమ్మిదిమంది ఎంపీలు కాంగ్రెస్‌కు చెందిన వారు. వీరిని సస్పెండ్ చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం చేశారు.
జమ్ముకశ్మీర్‌కి ప్రత్యేక అధికారాలిచ్చే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు జమ్ముకశ్మీర్ సమానమేనని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది.
మహిళా రిజర్వేషన్ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. సెప్టెంబరు 21న సభలో బిల్లు ఆమోదంపై చర్చ జరుగుతుందని, సెప్టెంబరు 21న రాజ్యసభలో బిల్లును చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సెప్టెంబరు 18-22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భారతదేశానికి భారత్‌గా పేరు మార్చే తీర్మానాన్ని ప్రభుత్వం తీసుకురావచ్చు. భారత రాజ్యాంగం ప్రస్తుతం దేశాన్ని భారతదేశం, అది భారత్..." అని సూచిస్తోంది, అయితే దీనిని కేవలం "భారత్"గా సవరించాలనే డిమాండ్ పెరుగుతోంది.
కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎంపి శోభా కరంద్లాజే మరియు ఇతర పార్టీ మహిళా సభ్యులు రాహుల్ గాంధీపై బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. సభలోని మహిళా సభ్యుల గౌరవాన్ని అవమానించడమే కాకుండా, ఈ సభ గౌరవాన్ని దిగజార్చడమే కాకుండా సభ్యుని ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.