Last Updated:

Mission LIFE: ‘మిషన్ లైఫ్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గుజరాత్ కెవాడియాలోని ఏక్తా నగర్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి)ని ప్రారంభించారు.

Mission LIFE: ‘మిషన్ లైఫ్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Gujarat: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గుజరాత్ కెవాడియాలోని ఏక్తా నగర్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద మిషన్ లైఫ్ (పర్యావరణానికి జీవనశైలి)ని ప్రారంభించారు. సుస్థిరత పట్ల ప్రజల సామూహిక విధానాన్ని మార్చడానికి త్రిముఖ వ్యూహాన్ని అనుసరించడం మిషన్ లైఫ్ లక్ష్యం.

వ్యక్తులను వారి దైనందిన జీవితంలో సరళమైన ఇంకా ప్రభావవంతమైన పర్యావరణ అనుకూల చర్యలను ఆచరించేలా చేయడం, పరిశ్రమలు మరియు మార్కెట్లు మారుతున్న డిమాండ్ సప్లయ్ కి వేగంగా స్పందించేలా చేయడం మరియు స్థిరమైన వినియోగం మరియు ఉత్పత్తి రెండింటికి మద్దతు ఇచ్చేలా ప్రభుత్వం మరియు పారిశ్రామిక విధానాన్ని ప్రభావితం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.

విదేశాంగ మంత్రిత్వ శాఖకెవాడియాలో అక్టోబర్ 20 నుండి 22 వరకు నిర్వహించే 10వ హెడ్స్ ఆఫ్ మిషన్స్ కాన్ఫరెన్స్‌లో కూడా ప్రధాని పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 118 మంది భారతీయ మిషన్ల అధిపతులు (రాయబారులు మరియు హైకమిషనర్లు) సమావేశమవుతారు. మూడు రోజుల పాటు సాగే 23 సెషన్ల ద్వారా సమకాలీన భౌగోళిక-రాజకీయ మరియు భౌగోళిక-ఆర్థిక పర్యావరణం, కనెక్టివిటీ మరియు భారతదేశ విదేశాంగ విధాన ప్రాధాన్యతలు వంటి అంశాల పై వివరణాత్మక అంతర్గత చర్చలు జరుగుతాయి. అనంతరం గుజరాత్‌లోని కెవాడియాలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం కానున్నారు.

 

ఇవి కూడా చదవండి: