PM Modi: అయోధ్యలో దీపోత్సవ్ కార్యక్రమానికి ప్రధాని మోదీ
దీపావళి వేడుకల కోసం ఆయోద్య ముస్తాబైంది. ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో దీపావళి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు.
Ayodhya: దీపావళి వేడుకల కోసం ఆయోద్య ముస్తాబైంది. ప్రధాని నరేంద్రమోదీ అయోధ్యలో దీపావళి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ప్రతీయేటా దీపావళికి ఒకరోజు ముందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపోత్సవ్ వెలుగుల పండుగని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రజలు అయోధ్యలోని నదీతీరంలో దీపాలతో వరుసలో ఉంటారు. గత ఏడాది తొమ్మిది లక్షల మందితో రికార్డు నెలకొల్పగా, ఈ సారి 15లక్షల మందితో చారిత్రాత్మక ప్రపంచ రికార్డు నెలకొల్పేలా యూపీ పర్యాటక శాఖ కృషి చేస్తోంది.
సరయూ నది ఒడ్డున నెలకొని ఉన్న రామ్‌కీ పైడి ఘాట్‌ల శ్రేణిలో దీపోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. తద్వారా అయోధ్యలోని భక్తుల సమక్షంలో దీపావళి పండుగను జరుపుకోనున్నారు. ప్రధాని మోదీ అయోధ్యలో పర్యటించనున్నారు. నగరంలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ మందిర స్థలాన్ని పరిశీలించి, ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం శ్రీరామచంద్ర భగవానునికి ప్రధాని మోదీ, అట్టహాసంగా రాజ్యాభిషేకం చేస్తారు. అనంతరం కొత్తఘాట్ వద్ద సరయా నదికి హారతి ఇస్తారు.
వేద మంత్రాలు, విద్యుత్ వెలుగుల నడుమ దీపోత్సవ వేడుక కడు రమ్యంగా జరగనుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నృత్యకళాకారులు నృత్యరూపాలు ప్రదర్శించనున్నారు. ఇదే రీతిలో ఎందరో కళాకారులు అయోధ్య నగరిలోదీపోత్సవ వేడుకలో తమ కళా ప్రదర్శనలు చేపట్టనున్నారు. ఈ వేడుకలన్నీ ప్రధాని సమక్షంలో జరగనున్నాయి. గ్రాండ్ మ్యూజికల్ లేజర్ షోతో పాటు సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద 3-డి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను సైతం ప్రధాన మంత్రి వీక్షించనున్నారు.