Last Updated:

Ayodhya: కోట్లాది హిందువుల కల సాకారమవుతున్న వేళ.. అయోధ్యలో పండుగ వాతావరణం

శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. మరి కోన్ని గంటల్లో బాల రాముడి విగ్రహానికి వేద పండితులు ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ మహా క్రతువులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటు సుమారు 7 వేల మంది అతిథులు హాజరుకానున్నారు.

Ayodhya: కోట్లాది హిందువుల కల సాకారమవుతున్న వేళ.. అయోధ్యలో పండుగ వాతావరణం

 Ayodhya: శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో పండుగ వాతావరణం నెలకొంది. మరి కొన్ని గంటల్లో బాల రాముడి విగ్రహానికి వేద పండితులు ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ మహా క్రతువులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ తో పాటు సుమారు 7 వేల మంది అతిథులు హాజరుకానున్నారు. దాంతో అయోధ్య మొత్తన్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ.. బాల రాముడి విగ్రహాన్ని తీర్చి దిద్దారు. గర్భగుడిలో 51 అంగుళాల ఎత్తుతో 5ఏళ్ల వయసు గల బాల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు.. 8 అడుగుల ఎత్తు, 4 అడుగుల వెడల్పుతో పాలరాతి సింహాసనం ఏర్పాటు చేశారు. అతిరథ మహారథులతో పాటు.. వేల మంది సాధు సంతులు.. భక్తులు హాజరుకానున్నారు. దీని కోసం దేశ వ్యాప్తంగా వెయ్యి రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

తెలుగు రాష్ట్రాల చిరు కానుకలు..( Ayodhya)

అయోధ్య రామమందిరాన్ని నాగరశైలిలో నిర్మించారు. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగు ఎత్తులో మందిరాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణానికి 392 స్థంబాలు, 44 ద్వారాలు ఉపయోగించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. అయోధ్య రామయ్యకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు చిరు కానుకలు పంపించారు. టీటీడీ నుంచి లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించగా.. సిరిసిల్లకు చెందిన భక్తులు బంగారు చీరను అందించారు. 8 గ్రాముల బంగారం, 210 గ్రాముల వెండితో చీరను తయారు చేశారు. ఇక హైదరాబాద్ నుంచి12 వందల 65 కిలోల భారీ లడ్డును అయోద్యకు పంపించగా.. వడోదరకు నుంచి 108 అడుగుల అగరుబత్తిని భక్తులు పంపించారు.

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. 12 వేల మందితో పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల కదలికపై కూడా అధికారులు నిఘా పెట్టారు. అయోధ్య నగరం మొత్తం సుమారు 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒక్క రామమందిర ఆవరణంలోనే 4 వందల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై కూడా అధికారులు నిఘా పెట్టారు.

రేపటి నుంచి దర్శనం..

రేపటి నుంచే భక్తులకు దర్శనం కల్పిస్తామని అధికారులు ప్రకటించారు. దర్శన సమయాలను రెండు స్లాట్లుగా విభజించారు. ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒక స్లాట్, మధ్యహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మరో స్లాట్లో దర్శనం కల్పించనున్నారు. శ్రీరాముడి నుదిటిపై సూర్యకిరణాలు పడేలా ఆలయాన్ని నిర్మించారు. బాలరాముడి నుదిటిపై 6 నిముషాల పాటు..తిలకం దిద్దేలా ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఏడాదికి ఒకసారి నుదుటి మీద సూర్యకిరణాలు పడేలా తీర్చి దిద్దారు.

UP News | प्रभु श्रीराम के स्वागत में उमड़े आयोध्यावासी, राममय हुईं अवधपुरी  की सड़कें | Navabharat (नवभारत)

 

Adani, Bachchan among 8,000 invited to Ram temple consecration