Last Updated:

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి మొదటిరోజు వచ్చిన విరాళాలు ఎంతో తెలుసా?

సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన మొదటి రోజు అయోధ్మ రామాలయంలో భక్తులు రూ. 3 కోట్లకు పైగా విరాళాలు అందించారని ఆలయ ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ, ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ ట్రస్ట్ ఇన్‌ఛార్జ్ అనిల్ మిశ్రా సోమవారం 'ప్రాణ్ ప్రతిష్ట' తర్వాత 10 విరాళాల కౌంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరానికి మొదటిరోజు వచ్చిన విరాళాలు ఎంతో తెలుసా?

Ayodhya Ram Mandir: సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన మొదటి రోజు సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన మొదటి రోజు అయోధ్మ రామాలయంలో భక్తులు రూ. 3 కోట్లకు పైగా విరాళాలు అందించారని ఆలయ ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ, ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ ట్రస్ట్ ఇన్‌ఛార్జ్ అనిల్ మిశ్రా సోమవారం ‘ప్రాణ్ ప్రతిష్ట’ తర్వాత 10 విరాళాల కౌంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. రామాలయంలో భక్తులు రూ. 3 కోట్లకు పైగా విరాళాలు అందించారని ఆలయ ట్రస్ట్ తెలిపింది.రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ, ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ ట్రస్ట్ ఇన్‌ఛార్జ్ అనిల్ మిశ్రా సోమవారం ‘ప్రాణ్ ప్రతిష్ట’ తర్వాత 10 విరాళాల కౌంటర్లను ప్రారంభించినట్లు తెలిపారు.

5 లక్షల మందికి పైగా భక్తులు..(Ayodhya Ram Mandir)

మంగళవారం (జనవరి 23) భక్తులు ఆలయ కౌంటర్లలో నగదు రూపంలో కానుకలు సమర్పించారు. ఆన్‌లైన్ విరాళాలతో కలిపి మొత్తం రూ. 3.17 కోట్లు అని మిశ్రా తెలిపారు.మంగళవారం 5 లక్షల మందికి పైగా రామభక్తులు ఆలయాన్ని దర్శించుకున్నారని, బుధవారం కూడా అంతే సంఖ్యలో భక్తులు తరలివచ్చారని ఆయన తెలిపారు.దర్శనం క్రమపద్ధతిలో జరిగేలా చూసేందుకు పరిపాలన అధికారులతో సంప్రదింపులు జరిపి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ఆఫీస్ బేరర్ దత్తాత్రేయ హోసబాలే అయోధ్య పరిసర సంఘ్ కార్యకర్తలను ఆలయాన్ని శుభ్రపరిచే బాధ్యతను తీసుకోవాలని ,ఆలయ దర్శనాన్ని చక్కగా నిర్వహించడంలో సహకరించాలని ఆదేశించారు.