Published On:

Miss World-2025: రేపే మిస్‌వరల్డ్ 2025 పోటీల గ్రాండ్‌ ఫైనల్‌.. ప్రైజ్ మనీ ఎంతంటే?

Miss World-2025: రేపే మిస్‌వరల్డ్ 2025 పోటీల గ్రాండ్‌ ఫైనల్‌.. ప్రైజ్ మనీ ఎంతంటే?

Miss World Grand Final – 2025 In Hyderabad: హైదరాబాద్‌తో మిస్ వరల్డ్ – 2025 గ్రాండ్ ఫైనల్స్ శనివారం జరగనున్నాయి. ఈ మేరకు నగరంలోని హైటెక్స్ వేదిక అంగరంగవైభవంగా ముస్తాభైంది. ఈ పోటీలను మొత్తం 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. అంతేకాకుండా ఈ పోటీలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై తిలకించనున్నారు. ఈ గ్రాండ్ ఫినాలే కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నారు. కాగా, ఈ పోటీల్లో విజేతకు బహుమతి కింద ఎనమిదిన్నర కోట్ల నగదు ఇవ్వనున్నారు.

 

ఈ పోటీలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు సరగనున్నాయి. అలాగే ఈ పోటీలకు బాలీవుడ్ నటులు, 2017 మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హాజరై సందడి చేయనున్నారు.