Last Updated:

Mumbai: దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై

దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ఈ ఏడాది ముంబై నిలిచింది. ఇక ఆసియాలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానంలో నిలిస్తే.. ఢిల్లీ 30వ స్థానాన్ని ఆక్రమించింది. 2024 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వేను హెచ్‌ఆర్‌ కన్సెల్టెన్సీ సంస్థ మెర్సర్‌ నిర్వహించింది.

Mumbai: దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై

Mumbai: దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ఈ ఏడాది ముంబై నిలిచింది. ఇక ఆసియాలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానంలో నిలిస్తే.. ఢిల్లీ 30వ స్థానాన్ని ఆక్రమించింది. 2024 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వేను హెచ్‌ఆర్‌ కన్సెల్టెన్సీ సంస్థ మెర్సర్‌ నిర్వహించింది. ఇతర దేశాల నుంచి ఉద్యోగాల కోసం వలస వచ్చిన వారిని ఉద్దేశించి ప్రపంచంలోని ఏ దేశం అత్యంత ఖరీదైందో మెర్సర్‌ సర్వే చేసి తాజా ర్యాంకింగ్‌ ఇచ్చింది. ఇక ఇండియా విషయానికి వస్తే 2013 నుంచి ముంబై అత్యంత ఖరీదైన నగరంగా నిలుస్తూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ముంబై 11 స్థానాలు ముందుకు జరిగి 136 ర్యాంకున నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 226 నగరాల్లో మెర్సర్‌ సర్వే నిర్వహించింది.

ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పది నగరాల విషయానికి వస్తే హాంగ్ కాంగ్‌‌, సింగపూర్‌, జూరిచ్‌, జెనీవా, బెర్న్‌, న్యూయార్కు సిటి, లండన్‌, నస్సావు, లాస్‌ఏంజిలెస్‌లు నిలిచాయి. ఇక ఇండియాలో టాప్‌ 20 నగరాల విషయానికి వస్తే న్యూఢిల్లీ మాత్రం 164 గ్లోబల్‌ ర్యాంకులో నిలిచింది. చెన్నై 189వ ర్యాంకు, బెంగళూరు 195, హైదరాబాద్‌ 202, పూనే 205, కోలకతా 207వ స్థానాన్ని ఆక్రమించాయి. ఇక ఆసియా విషయానికి వస్తే అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై 21వ స్థానం ఆక్రమించగా.. ఢిల్లీలో 30వ స్థానంలో నిలిచింది.

జీవన వ్యయం పెరుగుదల..(Mumbai)

మెర్సర్‌ ఇండియా మొబిలిటీ లీడర్‌ రాహుల్‌ శర్మ గ్లోబల్‌ ర్యాంకుల గురించి ప్రస్తావిస్తూ.. అత్యంత ఖరీదైన నగరాల ఎంపిక విషయానికి వస్తే పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. వాటిలో ప్రధానంగా ఉద్యోగావకాశాల వృద్దితో పాటు పెరిగిపోతున్న మధ్య తరగతి, అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకోవడం కూడా దేశంలో ప్రజల జీవనం ఖరీదైన వ్యవహారంగా మారిపోవడానికి ప్రధాన కారణంగా ఆయన చెప్పారు. ఇక ముంబై విషయానికి వస్తే కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ర్యాంక్‌ పెరిగినప్పటికి మొత్తానికి చూస్తే ఇండియాలోని నగరాలు చౌక అని తేల్చి చెప్పింది మెర్సర్‌, దీంతో బహుళజాతి కంపెనీలు లేదా ఇండియన్‌ కంపెనీలు గ్లోబల్‌ టాలెంట్‌ను ఆకర్షిస్తున్నాయని రాహుల్‌ శర్మ వివరించారు.

ఇక పెట్రోల్‌తో పాటు ఇతర యూటిలిటి సేవలు ముంబై, పూనేలో అత్యధికమని సర్వేలో తేలింది. ఇక రవాణా ఖర్చుల విషయానికి వస్తే ముంబైలో అత్యధికమని.. తర్వాత స్థానంలో బెంగళూరు నిలిచింది. ఇక అల్కహాల్‌, టొబాకోల విషయానికి వస్తే ఢిల్లీలో అత్యంత చౌక అయితే ఇవే చెన్నైలో అత్యధికమని మెర్సర్‌ సర్వేలో తేలింది.

ఇవి కూడా చదవండి: