Published On:

Asian Athletics Championship 2025: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్.. భారత్ కు గోల్డ్!

Asian Athletics Championship 2025: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్.. భారత్ కు గోల్డ్!

Gulveer Singh got Gold Medal in Asian Athletics Championship 2025: దక్షిణ కొరియా వేదికగా ఇవాళ ప్రారంభమైన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. పురుషుల 10 కి.మీ. పరుగులో గుల్వీర్ సింగ్ పసిడి పతకాన్ని పట్టేశాడు. 26 ఏళ్ల గుల్వీర్ సింగ్ 10 కి.మీ. పరుగును కేవలం 28 నిమిషాల 38.63 సెకన్ల వ్యవధిలో పూర్తి చేసి భారత్ ఖాతాలో స్వర్ణ పతకాన్ని వేశాడు. అలాగే ఆసియా ఛాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణ పతకం గెలిచిన మూడో భారత ఆటగాడిగా గుల్వీర్ రికార్డ్ సృష్టించాడు. పోటీలో జపాన్ కు చెందిన మెబుకి సుజుకీ రజతం, బహ్రెయిన్ కు చెందిన అల్బర్ట్ కిబిచీ కాంస్య పతకం సాధించారు.

 

కాగా ఉదయం జరిగిన 20 కిలోమీటర్ల పరుగు పందెంలో భారత్ కు చెందిన వాక్లో సర్విన్ సెబాస్టియన్ కాంస్య పతకం అందించారు. అయితే 20 కి.మీ. రేస్ ను ఆయన 1 గంట 21 నిమిషాల 13.60 సెకన్లలో పూర్తి చేశారు. కాగా ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు భారత్ తరపున 58 మంది క్రీడాకారులు హాజరయ్యారు.