Money Laundering: అతిక్ అహ్మద్‌పై మనీలాండరింగ్ విచారణ.. ఉత్తరప్రదేశ్‌లో ఈడీ దాడులు
ఉత్తరప్రదేశ్ లో రాజకీయ నాయకుడుగా మారిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ మరియు అతనితో సంబంధం ఉన్న వారిపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) బుధవారం ఉత్తరప్రదేశ్‌లో తాజా సోదాలు నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి.
Money Laundering: ఉత్తరప్రదేశ్ లో రాజకీయ నాయకుడుగా మారిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ మరియు అతనితో సంబంధం ఉన్న వారిపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) బుధవారం ఉత్తరప్రదేశ్‌లో తాజా సోదాలు నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి. ప్రయాగ్‌రాజ్ మరియు దాని పరిసర ప్రాంతాలతో సహా డజను ప్రదేశాలలో దాడులు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ప్రయాగరాజ్ కోర్టుకు అతిక్ అహ్మద్..( Money Laundering)
ఉమేష్ పాల్ హత్య కేసుకు సంబంధించి స్థానిక కోర్టులో హాజరుపరిచేందుకు అహ్మద్ గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు చేరుకోవాలని భావిస్తున్నారు. అతన్ని ఉత్తరప్రదేశ్ పోలీసు బృందం రోడ్డు మార్గంలో తీసుకువస్తోంది.పాల్ మరియు అతని ఇద్దరు పోలీసు సెక్యూరిటీ గార్డులు ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్ ప్రాంతంలోని అతని ఇంటి వెలుపల కాల్చి చంపబడ్డారు.పాల్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 25న అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్, భార్య షైస్తా పర్వీన్, ఇద్దరు కుమారులు, సహాయకులు గుడ్డు ముస్లిం, గులాం, మరో తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు.ఉత్తరప్రదేశ్ పోలీసులు మార్చి 26న అహ్మద్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు సబర్మతి జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకెళ్లారు.
రూ.8 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్ ..
2021లో, మనీలాండరింగ్ విచారణలో భాగంగా అహ్మద్ మరియు అతని భార్య యొక్క రూ.8 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆ సమయంలో కూడా కొన్ని సోదాలు నిర్వహించింది.అహ్మద్, నేరపూరిత కార్యకలాపాల ద్వారా అక్రమంగా డబ్బును నగదు రూపంలో సంపాదించేవాడు. దీనిని అతని మరియు అతని బంధువుల బ్యాంకు ఖాతాలలో జమ చేసేవాడని తమ దర్యాప్తులో కనుగొన్నట్లు ఏజెన్సీ తెలిపింది.”అతని సహాయకులు నడుపుతున్న వివిధ సంస్థల నుండి వారి ఖాతాలలో నిధులు జమ అవుతున్నాయని కూడా గమనించినట్లు ఈడీ పేర్కొంది.