Smriti Irani: సమాచార లోపంతో బుక్కయిన మంత్రి స్మృతి ఇరాని
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బిజెపి వర్గాల్లో గుబులు పుట్టిస్తుంది. గడిచిన నాలుగు రోజులుగా వ్యక్తిగత విషయాలను సైతం రాజకీయం చేస్తున్న బిజెపి తాజాగా సమాచార లోపంతో కాంగ్రెస్ తో లెంపలు వాయించుకొనే పరిస్ధితి ఆ పార్టీ నేతలకు ఎదురైంది
Prime9News Desk: వివరాల్లోకి వెళ్లితే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి భారత్ జోడో యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. బిజెపి పలు అంశాలను సంధిస్తూ కాంగ్రెస్ జోడో యాత్రను అడ్డుకొనేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జోడో యాత్ర ప్రారంభంలో స్వామి వివేకానందను మర్చిపోవడం సిగ్గుగా అనిపించడం లేదా అంటూ రాహుల్ పై విమర్శలు గుప్పించింది.
దీనికి కాంగ్రెస్ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. కన్యాకుమారి నుండి యాత్ర బయలుదేరే ముందు రాహుల్ గాంధీ వివేకనందుడి విగ్రహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. రాహుల్ నమస్కారం చేస్తున్న వీడియోను స్మృతి ఇరానీకి పంపిన కాంగ్రెస్ నేతలు స్పష్టంగా కనపడాలంటే కొత్త కళ్లద్దాలు పంపిస్తాం అంటూ వ్యంగాస్త్రాలు విసిరారు. దీంతో ఏదో చేద్దామని భావించిన బిజెపి నేతలపై నీళ్లు చల్లిన్నట్లైయింది.
విమర్శలు చేసే సమయంలో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం ఎంతవరకు సబబని బీజేపి శ్రేణుల్లో చర్చించు కోవడం కొసమెరుపుగా భావించాల్సిందే.