Srinivas Goud: బీఆర్ఎస్ విలీనం కోసం ఒత్తిడి తెచ్చిన మాట నిజమే.. స్పష్టం చేసిన మాజీ మంత్రులు!

BRS Ex Minister Srinivas Goud and Errabelli Dayakar rao key statements about brs and bjp partys: బీఆర్ఎస్ విలీనం వివాదంపై శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానంపై శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ విలీనం కోసం ఒత్తిడి తెచ్చిన మాట నిజమేనని, కవిత అరెస్ట్ కాకూడదంటే బీఆర్ఎస్ను విలీనం చేయమన్నారని చెప్పారు. ప్రాణమైనా ఇస్తా కానీ.. విలీనం మాత్రం చేయనని కేసీఆర్ చెప్పారన్నారు. రానున్న ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అధికారంలోకి వస్తుందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మరోవైపు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. బీఆర్ఎస్కు కేసీఆరే అధినాయకుడు అని స్పష్టం చేశారు. కేసీఆర్ను కాదనేవాళ్లు జీరో అవుతారన్నారు. రాష్ట్ర ప్రజలు సైతం మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ మూడోసారి సీఎం అవుతరాని తేల్చి చెప్పారు.