Last Updated:

Kerala: కేరళను “డ్రగ్స్ రాజధాని”గా మారుస్తున్నారు.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్

కేరళను "డ్రగ్స్ రాజధాని"గా మారుస్తున్నారని,రాష్ట్ర ఆదాయానికి రెండు ప్రధాన వనరులు లాటరీ మరియు మద్యం అయినందుకు సిగ్గుపడుతున్నట్లు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.

Kerala: కేరళను “డ్రగ్స్ రాజధాని”గా మారుస్తున్నారు.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్

Kerala: కేరళను “డ్రగ్స్ రాజధాని”గా మారుస్తున్నారని,రాష్ట్ర ఆదాయానికి రెండు ప్రధాన వనరులు లాటరీ మరియు మద్యం అయినందుకు సిగ్గుపడుతున్నట్లు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పేర్కొన్నారు.మద్యం వినియోగానికి వ్యతిరేకంగా అందరూ ప్రచారం చేస్తుంటే, కేరళ మాత్రం దాని వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు. శనివారం ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఖాన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ఇక్కడ లాటరీ, మద్యం మా అభివృద్ధికి సరిపోతుందని నిర్ణయించుకున్నాం. 100 శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రానికి అవమానకర పరిస్థితి. నా రాష్ట్రానికి రెండు ప్రధాన ఆదాయ వనరులు లాటరీ మరియు మద్యం అని రాష్ట్ర అధినేతగా నేను సిగ్గుపడుతున్నాను. లాటరీ అంటే ఏమిటి? ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఎప్పుడైనా లాటరీ టికెట్ కొన్నారా. చాలా పేదలు మాత్రమే లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తారు. మీరు వారిని దోచుకుంటున్నారు. మీరు మీ ప్రజలను మద్యానికి బానిసలుగా చేస్తున్నారు” అని ఖాన్ అన్నారు

ఖాన్ కేరళలోని వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల నియామకం అంశాన్ని కూడా లేవనెత్తారు.వైస్ ఛాన్సలర్ల నియామకం గవర్నర్ బాధ్యత అని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని అన్నారు.అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని, ప్రభుత్వం ఏదైనా చట్టం చేస్తే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలకు లోబడి ఉండాలని అన్నారు.తన అధికారాన్ని ప్రశ్నించిన కేరళ మంత్రుల ను కూడ ఖాన్ తప్పుబట్టారు.

ఇవి కూడా చదవండి: