Inflation: తగ్గిన హోల్ సేల్ ద్రవ్యోల్బణం.. అందుబాటులోకి ధరలు

Wholesale Market prices: భారత్ లో హోల్ సేల్ ద్రవ్యోల్బణం భారీగా తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలను కేంద్రం నిన్న ప్రకటించింది. కాగా ఏప్రిల్ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణం వివరాలను రిలీజ్ చేసింది. పలు ఆహారపదార్థాల ధరలు తగ్గడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.
ఏప్రిల్ లో హోల్ సేల్ ద్రవ్యోల్బణం 0.85 శాతం ఉన్నట్టు తెలిపింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గటం ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేందుకు కారణమైందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అలాగే తాయారీ ఉత్పత్తులు, ఇంధన ధరలు తగ్గడం కూడా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించింది. కాగా హోల్ సేల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది మార్చిలో 2.05 శాతంగా ఉండగా.. గత ఏడాది ఏప్రిల్ లో 1.19 శాతానికి తగ్గింది. ఇక ఆహారపదార్థాల ద్రవ్యోల్బణం మార్చిలో 1.57 శాతం ఉండగా.. ఏప్రిల్ లో 0.86 శాతానికి చేరుకుంది. కాగా ఆహార ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణం.. కూరగాయలతో పాటు, ఉల్లి, ఇతర ఆహారపదార్థాల ధరలు అదుపులోకి రావడమేనని ప్రభుత్వం చెప్పింది. దీంతో ప్రజలకు ఆహార పదార్థాలు అందుబాటు ధరల్లోకి రానున్నాయి.
కాగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదల పట్టడంతో అందుకు అనుగుణంగా హోల్ సేల్ ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి వచ్చినట్టు సమాచారం. దీంతో ఆర్బీఐ కీలక రెపో రేట్లను సవరించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆర్థిక వృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది.