Last Updated:

Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఆరుగురు మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకొనింది. కేదార్‌నాథ్‌ యాత్రికులను తీసుకెళ్లున్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు.

Helicopter Crash: కేదార్‌నాథ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌.. ఆరుగురు మృతి

Kedarnath: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకొనింది. కేదార్‌నాథ్‌ యాత్రికులను తీసుకెళ్లున్న ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు ఉన్నారు.

ఉత్తరాఖండ్‌లోని ఫాటా గ్రామం నుంచి కేదార్‌నాథ్ యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ ఉదయం 11.45 గంటలకు గరుడ్ చట్టి సమీపంలో ఘటన చోటు చేసుకొనింది. కేదార్ నాధ్ కు 3 కి.మీ దూరంలో హెలికాప్టర్ క్రాష్ అయింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ కూలిన అనంతరం ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి.

ఈ ఘటన పై విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ట్వీట్ ద్వారా స్పందించారు. కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్‌ కూలిపోవడం చాలా దురదృష్టకరంగా పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో ప్రాణ నష్టం, ప్రమాదం ఎలా సంభవించిందో తెలుసుకోవడానికి మేము రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించారు.

ఇది కూడా చదవండి: SpiceJet Flight: స్పైస్‌జెట్ విమానం క్యాబిన్‌లో పొగ.. చర్యలు తీసుకుంటామని డీజీసీఏ హెచ్చరిక

ఇవి కూడా చదవండి: