Published On:

Iran – Israel War Effect: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. వెనక్కి వచ్చిన లండన్ విమానం!

Iran – Israel War Effect: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. వెనక్కి వచ్చిన లండన్ విమానం!

Mumbai to London Air India flight to Return due to Iran – Israel War: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్ లోని అణు కేంద్రాలు, ఆర్మీ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులకు సమాధానంగా ప్రతికార చర్యలకు దిగేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 

అయితే ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకు తిరిగి ముంబైకి వచ్చేసింది. ముంబై ఎయిర్ పోర్టు నుంచి ఇవాళ తెల్లవారుజామున 5.39 గంటలకు ఎయిర్ ఇండియా ఏఐసీ 129 విమానం లండన్ బయల్దేరింది. 3 గంటలపాటు ప్రయాణం అనంతరం తిరిగి ముంబైకి చేరుకుంది. కాగా ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానం తిరిగి ముంబైకి వచ్చిందని ఎయిర్ ఇండియా ప్రకటించింది. అయితే పశ్చిమాసియాలో గగనతలంపై ఆంక్షలు ఉండటంతోనే విమానం తిరిగి ముంబైకి వచ్చిందని సమాచారం. పలు విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు. ఈ క్రమంలోనే లండన్ వెళ్తున్న విమానాన్ని వెనక్కి తీసుకువచ్చారు. కాగా నిన్న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాదంలో 262 మంది చనిపోయారు.