Liquor Deaths: తమిళనాడులో కల్తీ మద్యం సేవించి 13 మంది మృతి
తమిళనాడులో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో కల్తీ మద్యం సేవించి 13 మంది మృతి చెందగా, పలువురు ఆస్పత్రి పాలయ్యారు. విల్లుపురం జిల్లా మరక్కానంలో తొమ్మిది మంది, చెంగల్‌పట్టు జిల్లా మదురాంతకం వద్ద కల్తీ మద్యం సేవించి నలుగురు మృతి చెందారు.
Liquor Deaths: తమిళనాడులో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో కల్తీ మద్యం సేవించి 13 మంది మృతి చెందగా, పలువురు ఆస్పత్రి పాలయ్యారు. విల్లుపురం జిల్లా మరక్కానంలో తొమ్మిది మంది, చెంగల్‌పట్టు జిల్లా మదురాంతకం వద్ద కల్తీ మద్యం సేవించి నలుగురు మృతి చెందారు.
నలుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్..(Liquor Deaths)
ఈ సందర్బంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం, గుట్కా తయారు చేసి సరఫరా చేసిన 9 మందిని పోలీసులు 57 కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (నార్త్) ఎన్ కన్నన్ మాట్లాడుతూ బాధితులు ఇటనాల్-మిథనాల్ పదార్ధం కలిపిన నకిలీ మద్యం సేవించి ఉండవచ్చని అన్నారు. చెంగల్‌పట్టు జిల్లాలో, ఐదుగురు ఆసుపత్రి పాలయ్యారు. వారిలో నలుగురు చికిత్స పొందుతూ మరణించారు.చెంగల్‌పట్టు ఘటనకు సంబంధించి నిందితుడు అమ్మవసాయిని అరెస్టు చేశారు. రెండు సంఘటనలలో, కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేశాం.రెండు కేసుల్లోనూ పారిశ్రామిక అవసరాలకు వినియోగించే మద్యాన్ని వాడారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రెండు జిల్లాల నుంచి ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు సబ్-ఇన్‌స్పెక్టర్లను సస్పెండ్ చేశామని కన్నన్ తెలిపారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒక ప్రకటనలో రాష్ట్రంలో మద్యం సేవించడం వల్ల మరణాలు సంభవించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు, ఆస్పత్రిలో చేరిన వారికి రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని ఆయన ఆదేశించారు.