Last Updated:

CM KCR Announced: బీఆర్ఎస్ అభ్యర్దుల తొలిజాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 115 నియోజకవర్గాలకు తమ పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టామని, ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్‌లను మార్చినట్లు చెప్పారు.

CM KCR Announced: బీఆర్ఎస్ అభ్యర్దుల తొలిజాబితాను ప్రకటించిన సీఎం కేసీఆర్

 CM KCR Announced: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 115 నియోజకవర్గాలకు తమ పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్‌లో పెట్టామని, ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్‌లను మార్చినట్లు చెప్పారు.

రెండు స్దానాలనుంచి కేసీఆర్ పోటీ..( CM KCR Announced)

మరోవైపు కేసీఆర్ తన అసెంబ్లీ సిగ్మెంట్ గజ్వేల్ నుంచి మాత్రమే కాకుండా కామారెడ్డి నుండి కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వైరా, ఆసిఫాబాద్‌, బోథ్‌, ఉప్పల్‌ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు కేసీఆర్ చెప్పారు.హుజూరాబాద్‌ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు టిక్కెట్ ను ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించామన్నారు. నాలుగు స్థానాల్లో మాత్రం అభ్యర్దులను ఫైనల్ చేయవలసి ఉందని తెలిపారు.