Last Updated:

Chada Venkata Reddy: కమ్యూనిస్టులూ దేవుళ్లను నమ్ముతారు.. మేము నమ్ముతాం- చాడ వెంకటరెడ్డి

కమ్యూనిస్టులు దేవుళ్లకి వ్యతిరేకం కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

Chada Venkata Reddy: కమ్యూనిస్టులూ దేవుళ్లను నమ్ముతారు.. మేము నమ్ముతాం- చాడ వెంకటరెడ్డి

Chada Venkata Reddy: కమ్యూనిస్టులు దేవుళ్లకి వ్యతిరేకం కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

శనివారం భోగిపండుగ సందర్బంగా ఆయన హన్మకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నాస్తికులు, ఆస్తికులు ఉంటారని మతం అనేది విశ్వాసానికి సంబంధించిన విషయమని వ్యాఖ్యనించారు.

మతం పేరుతో, కులం పేరుతో ఆధిపత్యం చెలాయించాలని మత ఉన్మాదులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

అలాంటి ధోరణికి కమ్యూనిస్టులు వ్యతిరేకమని అన్నారు. కమ్యూనిస్టులు దేవుడిని నమ్మరు అని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని అన్నారు.

మేము దేవుళ్లను నమ్ముతాం..

తాము దేవుళ్లను నమ్ముతామని దేవుడిని నమ్మటం అనేది మానవతా సిద్ధాంతం అని చెప్పుకొచ్చారు.

కొత్తకొండలో హరిత హోటల్, యూనియన్ బ్యాంకు రావడానికి తానే కారణమన్నారు.

ఇటీవల మునుగోడు ఉప ఉన్నికలో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన తరువాత కమ్యూనిస్టులు కేసీఆర్ సర్కార్ పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలు అద్భుతమని, చాలా గొప్పగా ఉన్నాయని ఇటీవల చాడ వెంకటరెడ్ది పేర్కొన్నారు.

అదేవిధంగా రైతులు కూడా సంతోషంగా ఉన్నారని అన్నారు. చాడ వెంకటరెడ్డి(Chada Venkata Reddy) హుస్నాబాద్ నుంచి ఒకసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయారు.

ఈసారి అక్కడ నుంచే సీపీఐ అభ్యర్థిగా పోటీచేయాలని చాడ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనహుస్నాబాద్ నియోజకవర్గంలో జోరుగా పర్యటిస్తున్నారు.

మరోవైపు రైతులు, కూలీల సమస్యలపై ఎవరు పోరాటం చేసినా వారితో కలిసి తాము పనిచేస్తామని చాడ వెంకటరెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ విధానాలపై స్పష్టత వచ్చాక వారితో కలిసి పోటీ చేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

ధరణి పోర్టల్‌లో అనేక లోసుగులున్నాయని సర్వే నంబర్ల వారీగా సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేసారు.

అలా చేస్తే భూ సమస్యలు బయటకు రావడంతో పాటు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు వెలుగు చూస్తాయని తెలిపారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

 

 

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/