Telangana CM: మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి అవమానం.. సీఎం ఉత్తమ్ అంటూ నోరుజారిన ఎమ్మెల్యే

Tungaturthi congress MLA Samelu Insulted to Telangana CM: తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసినప్పటినుంచి వరుసగా అవమానాలు ఎదురవుతున్నాయి. ఆయనను సీఎంగా ఎవరూ కూడా గుర్తించలేదనే వార్తలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఇటీవల అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా సక్సెస్ మీట్‌లో హీరో మరచిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో నెలరోజుల పాటు వార్ జరిగిన సంగతి తెలిసిందే.
అలాగే, ఇది జరిగిన కొద్ది రోజులకే మరో ఈవెంట్‌లోనూ రేవంత్ రెడ్డికి అవమానం ఎదురైంది. హైదరాబాద్ నగరంలోని హైటెక్స్‌లో ప్రపంచ తెలుగు హాసభలు జరిగాయి. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా అసలు విషయంలోకి వెళ్తే.. యాంకర్‌గా చేస్తున్న బాలాదిత్య కూడా సీఎం రేవంత్ రెడ్డిని మర్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి అనే బదులుగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని ప్రస్తావించడం పెనుదుమారంగా మారింది. ఈ గందరగోళం నేపథ్యంలో యాంకర్ సవరించుకొని తిరిగి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కవర్ చేసేశాడు.
ఇదిలా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును మరచిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన పేరుకు బదులు కిరణ్ కుమార్ రెడ్డి అని నాలుక కరుచుకున్నారు. ఆ వెంటనే క్షమాపణలు చెప్పారు. కానీ జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.
తాజాగా, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం చర్చనీయాంశంగా మారింది. తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందు సామేలు సీఎం రేవంత్ రెడ్డి పేరు మరచిపోయారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి బదులుగా సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఆయన పేరును చాలా కాన్ఫిడెంట్‌గా సంబోధించారు. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ అవుతోంది.